Leading News Portal in Telugu

AUS vs PAK: అదో చెత్త ఎంపిక.. పాకిస్థాన్‌ క్రికెట్ పరువు తీయకండి!


AUS vs PAK: అదో చెత్త ఎంపిక.. పాకిస్థాన్‌ క్రికెట్ పరువు తీయకండి!

PCB included Sarfaraz Ahmed in place of Mohammad Rizwan: పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ జట్ల ‍మధ్య తొలి టెస్టు గురువారం ఆరంభం అయింది. టాస్‌ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో పాక్ బౌలింగ్ చేస్తోంది. ఆస్ట్రేలియా 55 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 230 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్‌ (124), స్టీవ్ స్మిత్ (29) పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే ఈ టెస్టులో పాక్ స్టార్‌ ఆటగాడు మహ్మద్‌ రిజ్వాన్‌కు చోటు దక్కపోవడం అందరని ఆశ్యర్యపరిచింది. ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌ను పక్కనపెట్టడంతో పాక్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ తొలి టెస్టు మ్యాచ్‌ ఆరంభానికి ముందే ఒక్కరోజు ముందే పీసీబీ తుది జట్టును ప్రకటించింది. మహ్మద్‌ రిజ్వాన్‌కు బదులుగా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ సర్ఫరాజ్ అహ్మద్‌కు పాక్ మేనెజ్‌మెంట్‌ ఛాన్స్‌ ఇచ్చింది. దాంతో పాక్‌ మేనెజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయంపై విమర్శల వర్షం కురిస్తోంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ను ఫాన్స్, నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అద్భుత ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌ను పక్కన పెట్టడం సరికాదని మాజీలు సైతం అంటున్నారు.

ఈ ఏడాది కివీస్‌తో టెస్టు సిరీస్‌లో అద్భుతంగా ఆడిన మహ్మద్‌ రిజ్వాన్‌ను పక్కన పెట్టడంపై పాక్ క్రికెట్‌ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ‘ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆపేయండి. పాకిస్తాన్ క్రికెట్‌ను అపహాస్యం చేయకండి’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇదో చెత్త ఎంపిక. మహ్మద్‌ రిజ్వాన్‌ను కాదని సర్ఫరాజ్‌ మహ్మద్‌ను ఎలా ఎంపిక చేస్తారు?. పాకిస్థాన్‌ క్రికెట్ పరువు తీయకండి’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. బాగా రాణించినా.. రిజ్వాన్‌కు అవకాశం ఇవ్వకపోవడం దారుణం, అదో చెత్త ఎంపిక అంటూ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

తొలి టెస్ట్‌కు పాక్‌ జట్టు:
ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్‌), బాబర్ ఆజమ్‌, సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (కీపర్‌), సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ ఆఫ్రిది, అమీర్ జమాల్, ఖుర్రం షెహజాద్.