Leading News Portal in Telugu

Ind vs SA: టీమిండియాకు బిగ్ షాక్.. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు ఆ స్టార్ బౌలర్ దూరం..


Ind vs SA: టీమిండియాకు బిగ్ షాక్.. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు ఆ స్టార్ బౌలర్ దూరం..

Mohammed Shami: భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. టెస్ట్ సిరీస్ కోసం తాను దక్షిణాఫ్రికా వెళ్లేందుకు రెడీగా లేనట్లు వెల్లడించాడు. తన మోకాలి నొప్పి కోసం చికిత్స తీసుకుంటున్నాను.. కాస్త ఊరట లభించినా కచ్చితంగా టీమ్ తో కలుస్తానని వెల్లడించాడు. లేకపోతే తాను సఫారీలతో జరిగే మ్యాచ్ లకు దూరం కావొచ్చు అని పరోక్షంగా తెలిపాడు. కాగా వన్డే ప్రపంచకప్‌-2023లోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన షమీ అద్భుతమైన బౌలింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఐసీసీ మెగాటోర్నీలో ఏకంగా మూడు సార్లు ఐదు వికెట్ల హాల్‌ నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాదు.. ఈ టోర్నీ మొత్తంగా 24 వికెట్లు తీసుకుని ప్రపంచకప్‌-2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు.

ఈ క్రమంలో ప్రపంచకప్ తర్వాత మోకాలి నొప్పితో రెస్ట్ తీసుకున్న ఈ ఉత్తర ప్రదేశ్ బౌలర్‌.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20, సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లకు దూరం కాబోతున్నాడు. అయితే, ప్రొటిస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ మహ్మద్ షమీ పేరును చేర్చింది. అతడు గాయం నుంచి కోలుకుంటే దక్షిణాఫ్రికాకు వెళ్తాడనే సంకేతాలు ఇచ్చింది. అయితే, డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికా- టీమిండియా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో షమీ తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ కీలక విషయాన్ని వెల్లడించాడు. మోకాలి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తే దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను.. చాలా కాలంగా ఈ నొప్పి వేధిస్తోంది.. ఇప్పటికే ఎన్నోసార్లు చికిత్స చేయించుకున్నాను.. కానీ, పూర్తిగా కోలుకోలేకపోతున్నాను అంటూ షమీ పేర్కొన్నారు. ఒకవేళ ఈ మోకాలి నొప్పి గనుక తగ్గితే నేను టెస్టు సిరీస్‌ ఆడటానికి కచ్చితంగా వెళ్తా.. లేదంటే అంతే ఇక అని షమీ పేర్కొన్నాడు.