
WFI Row: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు కావడాన్ని రెజ్లర్లు తట్టుకోలేకపోతున్నారు. ఆయన విజయంపై ఏస్ రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్ కెరీర్‌కి గుడ్ బై చెప్పింది. రెజ్లర్లు బజరంగ్ పునియా, విజేందర్ సింగ్ వంటి వారు తమ పద్మ శ్రీ అవార్డులను తిరిగి ప్రభుత్వానికి వాపస్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Bihar: “తల్లిని మించిన యోధులు లేరు”.. ప్రాణాలను అడ్డుపెట్టి పిల్లల్ని రక్షించింది.. వీడియో వైరల్..
ఇదిలా ఉంటే నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఈ రోజు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ డబ్ల్యూఎఫ్ఐ పాలక వర్గాన్ని సస్పెండ్ చేసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) నిర్వహణకు తాత్కాలిక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా క్రీడా మంత్రిత్వ శాఖ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)ని కోరింది. తాత్కాలిక కమిటీ అథ్లెట్ల ఎంపికతో పాటు డబ్ల్యూఎఫ్ఐ వ్యవహారాలను నిర్వహించగలదు, నియంత్రించగలదని ఐఓఏకి రాసిన లేఖలో పేర్కొంది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ ఆఫీస్ బేరర్ల ప్రభావం, నియంత్రణ నుంచి ఎదురయ్యే సవాళ్లలో డబ్ల్యూఎఫ్ఐ పాలన, సమగ్రత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి అని సెంట్రల్ అండర్ సెక్రటరీ తరుణ్ పరీక్ సంతకంతో ఉన్న లేఖ పేర్కొంది.