Leading News Portal in Telugu

Ambati Rayudu Quits YSRCP: బ్రేకింగ్‌: వైసీపీకి అంబటి రాయుడు గుడ్‌బై..


Ambati Rayudu Quits YSRCP: బ్రేకింగ్‌: వైసీపీకి అంబటి రాయుడు గుడ్‌బై..

Ambati Rayudu Quits YSRCP: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ మధ్యే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు.. అయితే, వైసీపీలో చేరకముందు నుంచే ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతూ వచ్చిన రాయుడు.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.. జగన్ సర్కార్‌పై ప్రశంసలు కురిపిస్తూ రాజకీయాల్లోకి వచ్చేందుకు బాటలు వేసుకోవడమే కాదు.. వైసీపీలో చేరనున్నట్టు ఇంట్ ఇచ్చారు.. దాని అనుగుణంగా సీఎం సమక్షంలో గత నెల 28వ తేదీన వైసీపీలో చేరిన ఆయన.. ఉన్నట్టుండి ఇప్పుడు వైసీపీ వీడుతున్నట్టు ప్రకటించారు.


నేను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను అంటూ సోషల్‌ మీడియాలో వెల్లడించారు అంబటి రాయుడు.. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా.. త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాను.. ధన్యవాదాలు అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు అంబటి రాయుడు.. అయితే, గుంటూరు పార్లమెంట్‌ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వచ్చారు అంబటి రాయుడు.. జగన్‌ సర్కార్‌పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు కూడా చేశారు. జగన్‌ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు తాను ఆకర్షితుడిని అయినట్టు కూడా చెప్పుకొచ్చారు.. ఈ నేపథ్యంలోనే గత నెల 28వ తేదీన సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ, పట్టుపని పది రోజులు కూడా గడవకముందే మళ్లీ వైసీపీకి గుడ్‌బై చెబుతూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.. అయితే, దీనిపై అంబటి వర్గం నుంచి ఎలాంటి స్పందనలేదు.. గుంటూరు పార్లమెంట్‌ గానీ లేదా గుంటూరు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాకపోవడంతోనే అంబటి రాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ పొలిటికల్‌ సర్కిల్‌లో సాగుతోంది.

అంబటి రాయుడు తాజా ట్వీట్‌