
టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 15.4 ఓవర్లలోనే చేధించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (68), శివం దూబే (63) అజేయంగా నిలిచి అఫ్ఘాన్ బౌలర్లకు ఊచకోత చూపించారు. లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసి సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.
Kite String Slits Throat: గాలిపటం దారం గొంతును కోయడంతో 4 ఏళ్ల బాలుడి మృతి..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్తాన్ 2 ఓవర్లలో 172 పరుగులు చేసింది. అఫ్ఘాన్ బ్యాటర్లలో గుల్బాదిన్ 57 అర్ధసెంచరీతో రాణించాడు. ఆ తర్వాత గుర్బాజ్ 14, ఇబ్రహీం జర్దాన్ 8, అజ్మతుల్లా 2, నబీ 14, నజీబుల్లా 23, కరీం జనత్ 20, ముజీబ్ 21, నూర్ అహ్మద్ 1, నవీన్ ఉల్ హక్ 1 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్ 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు సాధించారు. శివం దూబేకు ఒక వికెట్ దక్కింది.
Rakesh Master: భౌతికంగా లేకపోయినా.. బ్లాక్ బస్టర్ మూవీలో భాగమయ్యాడు
173 పరుగుల లక్ష్యచేధనలో బరిలోకి దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ డకౌట్ రూపంలో ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభం నుంచే అఫ్ఘాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన విరాట్ కోహ్లీ 29, శివం దూబే 63, రింకూ సింగ్ 9 పరుగులు చేశారు. అఫ్ఘానిస్తాన్ బౌలర్లలో కరీం జనత్ 2 వికెట్లు తీయగా.. ఫజల్ ఫరూకీకి ఒక వికెట్ దక్కింది.