Leading News Portal in Telugu

Virat Kohli: విరాట్ కోహ్లీ దంపతులకు రామ మందిర ఆహ్వానం.. ఫోటోలు వైరల్..


Virat Kohli: విరాట్ కోహ్లీ దంపతులకు రామ మందిర ఆహ్వానం.. ఫోటోలు వైరల్..

Virat Kohli: స్టార్ క్రికెటర్, కింగ్ విరాట్ కోహ్లీకి రామ మందిర ఆహ్వానం అందింది. కోహ్లీ, అనుష్క దంపతులను జనవరి 22న జరగబోయే రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా ఆలయ ట్రస్ట్ ఆహ్వానం అందించింది. అంతకుముందు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఆహ్వానించారు. సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, చిరంజీవి, రణబీర్ కపూర్ వంటి ప్రముఖులకు కూడా రామ మందిర ట్రస్టు ఆహ్వానాలను అందించింది.


జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రముఖులతో పాటు సాధువులను మొత్తం 7000 మందికి ఆహ్వానం అందింది. ఆహ్వానం అందిన వారిలో సాధువులతో పాటు బిజినెస్ మ్యాన్స్, స్పోర్ట్స్, సినీ ప్రముఖులు, పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులతో పాటు కరసేవ చేసిన కుటుంబాలను కూడా ఆహ్వానించారు. ఈ రోజు నుంచే అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది. అయోధ్యలో ఎటుచూసినా పండగ వాతావరణం కనిపిస్తోంది.