Leading News Portal in Telugu

Sara Tendulkar-Gill: శుభ్‌మాన్ గిల్ సోదరితో సారా టెండూల్కర్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా?


Sara Tendulkar-Gill: శుభ్‌మాన్ గిల్ సోదరితో సారా టెండూల్కర్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా?

Sara Tendulkar Spotted With Shubhman Gill Sister: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్, టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో డేటింగ్ చేస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ డేటింగ్ వార్తలను అటు గిల్‌ కానీ.. ఇటు సారా కానీ ఖండించలేదు. అలా అని ధృవీకరించ లేదు కూడా. గిల్‌-సారా ఎప్పటికప్పుడు బయట కనిపిస్తూనే ఉన్నారు. డేటింగ్ ఊహాగానాల మధ్య తాజాగా శుభ్‌మాన్ సోదరి షహనీల్‌ గిల్‌తో సారా కనిపించింది. ఇద్దరు ఒకే కారులో వెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.


శుభ్‌మన్ గిల్ సోదరి షహనీల్‌ గిల్‌తో కలిసి సారా టెండూల్కర్ లేట్ నైట్ పార్టీకి వెళ్లినట్లు తెలుస్తోంది. సారా బ్లాక్ డ్రెస్‌లో అందంగా ఉండగా.. షహనీల్ క్యాజువల్ డ్రెస్‌లో ఉంది. కెమెరా కనపడగానే సారా ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని దాచుకునే ప్రయత్నం. అబ్బా.. మనం దొరికిపోయాం అన్నట్లు దాచుకుంది. మరోవైపు షహనీల్‌ మాస్క్‌ పెట్టుకోవడంతో పెద్దగా హైరానా పడలేదు. షహనీల్‌తో సారా కనిపించడంతో.. వీరి ప్రేమాయణానికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కామన్ ఫ్రెండ్ ద్వారా సారా టెండూల్కర్, శుభ్‌మాన్ గిల్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవ్వడం, కామెంట్లు చేసుకోవడం.. రెస్టారెంట్‌లలో కనిపించడంతో వీరి యవ్వారం అందరికి తెలిసింది. మధ్యలో సారా అలీ ఖాన్‌తో గిల్ ఓ రెస్టారెంట్‌లో కనిపించడంతో.. సారా-గిల్ మధ్య బ్రేకప్ అయ్యిందని అంతా అనుకున్నారు. అయితే కాఫీ విత్ కరణ్ షో సీజన్ 8లో పాల్గొన్న సారా అలీఖాన్.. గిల్‌తో ప్రేమాయణం ఏమీ లేదని స్పష్టం చేసింది. ఆ సారా తాను కాదని అని క్లారిటీ ఇచ్చింది. ఇక వన్డే ప్రపంచకప్ 2023 సందర్భంగా భారత్ ఆడిన మ్యాచ్‌లకు సారా హాజరై గిల్‌ను ఏకరేజ్ చేసింది. ఈ విషయంపై సచిన్ టెండూల్కర్ ఇంతవరకు స్పందించకపోవడంతో ఇదంతా నిజమే అని అందరూ అనుకుంటున్నారు.