Leading News Portal in Telugu

Vizag Test: విశాఖ టెస్టు.. తెలుగు ఆటగాడిని సన్మానించనున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్!


Vizag Test: విశాఖ టెస్టు.. తెలుగు ఆటగాడిని సన్మానించనున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్!

ACC Plans to felicitated KS Bharat in IND vs ENG 2nd Test: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వైజాగ్‌ వేదికగా భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్‌ చేజార్చుకున్న రోహిత్‌ సేన.. వైజాగ్‌ టెస్టులో పుంజుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం భారత క్రికెటర్లు విశాఖ మైదానంలో ప్రాక్టీస్‌లో బిజీ అయ్యారు. రెండో టెస్టు కోసం రెండు రోజుల కిందటే విశాఖపట్నంకు చేరుకున్న టీమిండియా క్రికెటర్లు బుధవారం స్టేడియంలో చెమటోడ్చారు. టీమిండియా కీపర్‌, ఆంధ్ర కెప్టెన్‌ కేఎస్ భరత్‌ తన హోం గ్రౌండ్‌లో తొలి టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు సిద్దమయ్యాడు.


సొంత గడ్డపై తొలి మ్యాచ్‌ ఆడుతున్న కేఎస్ భరత్‌ను ఘనంగా సన్మానించాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్ణయించుకుంది. ‘విశాఖ నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన శ్రీకర్‌ భరత్‌ను రెండో టెస్ట్ సందర్భంగా ఘనంగా సన్మానిస్తాం. ఈ కార్యక్రమంను గురువారం స్టేడియంలో ఏర్పాటు చేశాం. ఇది భరత్‌ విజయానికి దగ్గిన గౌరవం’అని ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్‌ రెడ్డి తెలిపారు. భరత్‌ క్రికెట్‌ ప్రయాణం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలోనే ప్రారంభమైంది. 2005లోబాల్ బాయ్‌గా ఉన్న అతడు.. అదే మైదానంలో ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు.

సొంతగడ్డపై టెస్టులో ఆడనున్న రెండో ఆంధ్ర ఆటగాడిగా కేఎస్ భరత్‌ నిలవనున్నాడు. భరత్‌ కంటే ముందు ఆంధ్ర ప్లేయర్‌ సీకే నాయుడు సొంతగడ్డపై ఆడాడు. ఎమ్మెస్కె ప్రసాద్‌, వేణు గోపాల్ రావు, హనుమ విహారి భారత్‌ తరపున టెస్టుల్లో ఆడినప్పటికీ.. సొంతగడ్డపై ఆడే ఛాన్స్‌ రాలేదు. ఇక వీవీఎస్ లక్షణ్ హైదరాబాద్ ప్లేయర్ అన్న విషయం తెలిసిందే. భరత్‌ ఇప్పటివరకు 6 టెస్టులు ఆడి 198 పరుగులు చేశాడు.