Leading News Portal in Telugu

Sachin Tendulkar: బైక్‌పై వెళ్తున్న అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చిన సచిన్.. వీడియో వైరల్!


Sachin Tendulkar: బైక్‌పై వెళ్తున్న అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చిన సచిన్.. వీడియో వైరల్!

Sachin Tendulkar Meets His Fan at Road: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ తన అభిమానికి భారీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న తన అభిమానిని ఫాలో అయి మరి మాట్లాడాడు. తన ఆరాధ్య క్రికెటర్‌ను చూసిన సదరు అభిమాని.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన అభిమానితో కాసేపు మాట్లాడిన సచిన్.. ఆటోగ్రాఫ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఇందుకుసంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.


సచిన్ టెండూల్కర్ గురువారం తన స్నేహితుడితో కలిసి కారులో వెళుతుండగా.. రోడ్డుపై ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించి ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. ఆ జెర్సీపై ‘టెండూల్కర్.. ఐ మిస్ యూ’ అని రాసి ఉండడాన్ని సచిన్ చూశాడు. దాంతో ఆ అభిమానిని కారులోనే ఫాలో అయ్యాడు. రద్దీ తక్కువ ఉన్న ప్రాంతంలో కారుని ఆపి.. విమానశ్రయానికి ఎలా వెళ్లాలని అడిగాడు. సచిన్‌ను చూసిన ఆ అభిమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆపై తేరుకుని దేవుడికి థాంక్స్ చెపుతాడు. తాను ఎంత పెద్ద ఫ్యానో సచిన్‌కు వివరిస్తాడు. తన చేతి మీద ఉన్న టాటూ, తన కుమారుడి చిత్రాలను టెండూల్కర్‌కి చూపిస్తాడు. సచిన్ ఫొటో కలెక్షన్లన కూడా చూపిస్తాడు. అభిమాని ప్రేమకు సచిన్ ఫిదా అవుతాడు. ఆపై అతడికి ఆటోగ్రాఫ్ ఇచ్చి.. హెల్మెట్ పెట్టుకుని బైక్ నడపడంను ప్రశంసిస్తాడు.

తన అభిమానిని కలిసిన వీడియోను సచిన్ టెండూల్కర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘సచిన్.. టెండూల్కర్‌ని కలిశాడు. నాపై ఇంత ప్రేమ కురిపించడం చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది. ఊహించని విధంగా వచ్చే ప్రేమే జీవితాన్ని చాలా ప్రత్యేకం చేస్తుంది’ అని సచిన్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సచిన్ భారత్ తరఫున 200 టెస్టులు, 463 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు.