Leading News Portal in Telugu

IND vs ENG: ముగిసిన భారత్ రెండో ఇన్సింగ్స్.. ఇంగ్లండ్ టార్గెట్ 399


IND vs ENG: ముగిసిన భారత్ రెండో ఇన్సింగ్స్.. ఇంగ్లండ్ టార్గెట్ 399

వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈరోజు ఆటలో వన్డౌన్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగిన శుభ్మాన్ గిల్ సెంచరీ (104) చేసి జట్టుకు ఆధిక్యాన్ని పెంచాడు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన శ్రేయాస్ అయ్యర్ 29, రజత్ పాటిదర్, అక్షర్ పటేల్ 45, శ్రీకర్ భరత్ 6, అశ్విన్ 29, కుల్దీప్, బుమ్రా డకౌట్ గా పెవిలియన్ బాట పట్టారు.


రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌ నైట్‌ 28/0 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్‌ అండర్సన్ వరుస ఓవర్లలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (17), రోహిత్ శర్మ (13)ను ఔట్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 4 వికెట్లతో చెలరేగగా..రెహన్ అహ్మద్ 3, జేమ్స్ అండర్సన్ 2, బషీర్ ఒక వికెట్ పడగొట్టారు. 399 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ప్రస్తుతం వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది.