
Shreyas Iyer direct throw rattles stumps to dismiss Ben Stokes; టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ బ్యాట్‌తో విఫలమైనా.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇప్పటికే సూపర్ రన్నింగ్ క్యాచ్ పట్టిన శ్రేయాస్.. అద్భుత త్రోతో కీలక ఆటగాడిని రనౌట్ చేశాడు. ఆర్ అశ్విన్ వేసిన 53వ ఓవర్ 4వ బంతి బెన్ ఫోక్స్ బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని స్క్వేర్ లెగ్ వైపు వెళ్లింది. నాన్ స్ట్రైకర్ బెన్ స్టోక్స్ సింగిల్ కోసం ప్రయత్నించగా.. మిడ్ వికెట్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన శ్రేయాస్ డైరెక్ట్ హిట్‌తో రనౌట్ చేశాడు. దాంతో స్టోక్స్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తొలి ఇన్నింగ్స్‌లో ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్ జాక్ క్రాలే (76)ను అద్భుత క్యాచ్‌తో శ్రేయాస్ అయ్యర్ పెవిలియన్ చేర్చాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్రాలే షాట్ ఆడగా.. బంతి గాల్లోకి లేచింది. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్.. వెనక్కి పరిగెత్తి డైవ్ చేసి మరీ బంతిని అందుకున్నాడు. విశాఖ టెస్ట్ మ్యాచ్‌లోశ్రేయాస్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 56 (27, 29) పరుగులు మాత్రమే చేసిన విషయం తెలిసిందే.
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కీలక వికెట్ కోల్పోయింది. ప్రమాదకరంగా మారుతున్న బెన్ ఫోక్స్ (36)ను రిటర్న్ క్యాచ్‌తో జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేశాడు. దీంతో 275 పరుగుల వద్ద ఇంగ్లండ్ 8వ వికెట్‌ను కోల్పోయింది. టామ్ హార్ట్‌లీ (30), షోయబ్ బషీర్ (0) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 120 రన్స్ అవసరం కాగా.. భారత్ గెలుపుకు కేవలం 2 వికెట్స్ కావాలి. విశాఖ టెస్ట్ భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
What a throw by Shreyas Iyer. 🔥🫡pic.twitter.com/saweZmuMhP
— Johns. (@CricCrazyJohns) February 5, 2024