Leading News Portal in Telugu

Kane Williamson: బ్రాడ్‌మన్‌, కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన కేన్‌ మామ!


Kane Williamson: బ్రాడ్‌మన్‌, కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన కేన్‌ మామ!

Kane Williamson smashes 30th Test century: న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు డాన్‌ బ్రాడ్‌మన్‌, భారత స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ పేరిట ఉన్న 29 సెంచరీల రికార్డును కేన్‌ మామ అధిగమించాడు. బే ఓవల్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో విలియమ్సన్‌ సెంచరీ (118; 289 బంతుల్లో 16 ఫోర్లు) చేసి ఈ ఘనత అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో 13వ స్థానానికి చేరుకున్నాడు.


టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ పేరుపై ఉన్న విషయం తెలిసిందే. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెస్టుల్లో 51 శతకాలు బాదాడు. కేన్‌ విలియమ్సన్‌ 30వ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు జో రూట్‌, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మథ్యూ హెడెన్‌, వెస్టిండీస్ మాజీ ఓపెనర్ ఎస్ చంద్రపాల్ కూడా 30 శతకాలు చేశారు. విలియమ్సన్ 97 టెస్టుల్లో 169 ఇన్నింగ్స్‌లు ఆడి 3ఓ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో కేన్‌ మామ అత్యధిక స్కోరు 251.

తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ ఆటముగిసే సమయానికి 2 వికెట్స్ కోల్పోయి 258 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (1), టామ్‌ లాథమ్‌ (20) నిరాశపపరిచారు. రచిన్‌ రవీంద్ర (209) డబుల్ సెంచరీ చేయగా.. కేన్‌ విలియమ్సన్‌ (118) సెంచరీ చేశాడు. రచిన్‌, గ్లెన్ ఫిలిప్స్ (14) క్రీజులో ఉన్నారు. డారిల్ మిచెల్ (34), టామ్ బ్లండెల్ (11) పరుగులు చేశారు.