
బెంగళూరులో భారత హాకీ జట్టు ఆటగాడిపై పోక్సో కింద కేసు నమోదైంది. భారత హాకీ టీమ్ డిఫెండర్ వరుణ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి గత ఐదేళ్లుగా పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
2018లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వరుణ్ కుమార్, బాధిత బాలిక పరిచయమయ్యారు. అప్పుడు తన వయస్సు 17 సంవత్సరాలు అని తెలిపింది. ఆ సమయంలో వరుణ్ సాయి స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందుతున్నాడని ఫిర్యాదులో తెలిపింది. దీంతో.. వరుణ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతని కోసం జ్ఞానభారతి పోలీసులు జలంధర్‌లో వెతుకుతున్నట్లు సమాచారం. కాగా.. వరుణ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
వరుణ్ కుమార్ హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవాడు. అతను హాకీ ఇండియా లీగ్ లో పంజాబ్ తరుఫున ఆడతాడు. 2017లో భారత జట్టుకు అరంగేట్రం చేసి.. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. వరుణ్ కుమార్ 2022 ఆసియా గేమ్స్‌లో బంగారు పతకం గెలిచిన జట్టులో సభ్యుడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత కాంస్య పతకాన్ని గెలుచుకున్న జట్టులో సభ్యుడు.