
అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో.. ఉదయ్ సహారన్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. కాగా.. ఈనెల 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే.. పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య సెమీస్ మ్యాచ్ జరిగితే, ఆ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది ఫైనల్ కు చేరుకుంటుంది. ఫైనల్లో ప్రత్యర్థి జట్టును పాకిస్తాన్ ను ఓడించినా.. ఆస్ట్రేలియాను ఓడించినా భారత్ రివేంజ్ తీసుకున్నట్లు అవుతుంది.
సెమీస్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ముందు 245 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది. ఈ లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సచిన్ దాస్ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేశాడు. సచిన్ దాస్ 95 బంతుల్లో 96 పరుగులు చేశాడు. దాంతోపాటు.. టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ 124 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఉదయ్ సహారన్, సచిన్ దాస్ మధ్య 171 పరుగుల భాగస్వామ్యం ఉంది.
AP Budget 2024: రేపు ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. ఉదయం 8 గంటలకే కేబినెట్ సమావేశం
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే దెబ్బతగిలింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత అర్షిన్ కులకర్ణి 12 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్న ముషీర్ ఖాన్ 4 పరుగులు మాత్రమే చేశాడు. ప్రియాంషు మోలియా 5 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. భారత జట్టు 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ ఉదయ్ సహారన్, సచిన్ దాస్ కలిసి టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చారు.
దక్షిణాఫ్రికా తరఫున ట్రిస్టన్ లూస్, మేనా ఫకా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్.. కెప్టెన్ ఉదయ్ సహారన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరఫున ఓపెనర్ జువాన్ డ్రే ప్రిటోరియస్ 102 బంతుల్లో 76 పరుగుల అత్యధిక స్కోరు సాధించాడు. ఆ తర్వాత రిచర్డ్ సెలెస్వీన్ 100 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇక.. భారత్ బౌలింగ్ లో రాజ్ లింబానీ 3 వికెట్లు పడగొట్టాడు. ముషీర్ ఖాన్ 2.. నమన్ తివారీ, సౌమీ పాండేకు చెరో వికెట్ దక్కింది.
Donald Trump: ట్రంప్‌కి యూఎస్ కోర్ట్ షాక్.. విచారణ నుంచి మినహాయింపు లేదని తీర్పు..