Leading News Portal in Telugu

SA T20 2024: రెచ్చిపోయిన డుప్లెసిస్.. సూపర్ కింగ్స్ ఘన విజయం


SA T20 2024: రెచ్చిపోయిన డుప్లెసిస్.. సూపర్ కింగ్స్ ఘన విజయం

సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్‌-2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ క్వాలిఫియర్‌-2కు నేరుగా అర్హత సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం నాడు పార్ల్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో క్వాలిఫియర్‌-2 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పార్ల్‌ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 138 పరుగులకే అలౌట్ అయింది. అయితే, జో బర్గ్‌ బౌలర్లలో సామ్‌ కుక్‌ నాలుగు వికెట్లు తీసుకుని రాయల్స్‌ పతనాన్ని శాసించాగా.. నంద్రే బర్గర్‌ 3, తహీర్‌ రెండు వికెట్లు తీసుకుని సత్తాచాటారు. ఇక, రాయల్స్‌ బ్యాటర్లలో డేవిడ్‌ మిల్లర్‌(47) ఒక్కడే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.


అనంతరం క్రీజులోకి వచ్చిన సూపర్‌ కింగ్స్‌ ఒక్క వికెట్‌ నష్టపోయి కేవలం 13.2 ఓవర్లలో 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అయితే, సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్లు లీస్‌ డుప్లే, ఫాప్‌ డుప్లెసిస్‌ హాఫ్‌ సెంచరీలతో రెచ్చిపోయారు. డుప్లై 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 రన్స్ చేయగా.. డుప్లెసిస్‌ 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55 పరుగులు రాబట్టాడు. ఫిబ్రవరి 8న జోబర్గ్ సూపర్ కింగ్స్ క్వాలిఫియర్‌-2లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌తో పోటీ పడబోతుంది.