
Mohammed Siraj photo with Orry Shakes Internet: ఇటీవలి రోజుల్లో బాలీవుడ్ సెలెబ్రిటీలతో ఓ వ్యక్తి ఎక్కువగా కనిపిస్తున్నాడు. స్టార్ హీరో, హీరోయిన్‌లను పట్టుకుని ఫొటోలకు పోజులిస్తున్నాడు. అతడితో ఫొటోలు దిగేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అతడే ‘ఓర్హాన్ అవత్రమణి అకా ఓరీ’. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓరీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా సంచలనం ఓరీ షేర్ చేసిన ఫొటోస్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఆ ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో ఓరీ ఫొటోలు దిగాడు.
ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ఫిబ్రవరి 5న ముగియగా.. 15 నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ఆరంభం కానుంది. మూడో టెస్టుకు 10 రోజుల సమయం దొరకడంతో భారత ఆటగాళ్లు సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ముంబైలో కనిపించాడు. బుధవారం రాత్రి ముంబైలోని బాంద్రాలో సిరాజ్ కనిపించాడు. సిరాజ్ ఓ ఈవెంట్‌కు వెళ్లగా.. అక్కడ సోషల్ మీడియా సంచలనం ఓరీని కలిశాడు. సిరాజ్‌తో ఓరీ తన ఐకానిక్ పోజ్ పెట్టి ఫొటోలు దిగాడు. ఈ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఇవి చాలా మంది అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ పెద్దగా ఆకట్టుకోలేదు. సొంత మైదానం అయిన ఉప్పల్ స్టేడియంలో సిరాజ్ బంతితో ఆకట్టుకోలేదు. అందులోనూ టీమిండియా ఓడిపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టు తుది జట్టులో అతడు చోటు దక్కించుకోలేకపోయాడు. విశ్రాంతి ఇచ్చామని కెప్టెన్ రోహిత్ చెప్పాడు. ఇక మూడో టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్న నేపథ్యంలో సిరాజ్ ఆడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న మూడో టెస్టు కోసం భారత ప్లేయర్స్ రాజ్‌కోట్‌లో కలవనున్నారు.
Mohammed Siraj with Orry. pic.twitter.com/141Yxt7Z3L
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 8, 2024