Leading News Portal in Telugu

Yashasvi Jaiswal: య‌శ‌స్వీ డ‌బుల్ సెంచరీ.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్! ఇంగ్లండ్ లక్ష్యం 557 పరుగులు



Yashasvi Jaiswal Double Hundred

India declare after Yashasvi Jaiswal slams double century: రాజ్‌కోట్ టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 430/4 వ‌ద్ద‌ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దాంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లండ్‌కు 557 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో యువ ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్ (214 నాటౌట్; 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స‌ర్లు) డబుల్ సెంచ‌రీ బాదాడు. మరోవైపు అరంగేట్ర ఆటగాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌ (68 నాటౌట్; 78 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ సాధించాడు. శుభ్‌మ‌న్ గిల్ (91) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లీష్ బౌలర్లలో రూట్, రెహాన్‌, హార్ట్‌లీ తలో వికెట్‌ తీశారు.