
పండంటి రెండో బిడ్డకు జన్మనిచ్చిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తమ కొడుకుకు ‘అకాయ్’ అని నామకరణం చేశారు. అయితే ఆ పేరుకు అర్థం ఏంటంటే ప్రకాశించే చంద్రుడని అర్థం. ఈ పేరు టర్కిష్ మూలానికి చెందినది. ఇక మొదటి కుమార్తెకు ‘వామిక’ అని పేరు పెట్టారు. వామిక అంటే దుర్గాదేవి అని అర్థం. శివుడిలో సగభాగమైన పార్వతీ దేవి మరోపేరు వామిక. అలాగే విరాట్-అనుష్క పేర్లు కలిసేలా ఈ పేరు ఉంది.
Read Also: Jayalalitha: జయలలిత ఆభరణాలపై బెంగళూరు కోర్టు కీలక తీర్పు
ఫిబ్రవరి 15న అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో కోహ్లీ, అనుష్క దంపతులకు విషెస్ చెబుతూ పలువురు సెలబ్రెటీలు, ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. మరోవైపు.. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో సిరీస్ మొత్తానికి కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘకాలం పాటు ఆట నుంచి విరామం తీసుకోవడంతో.. అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో గుడ్ న్యూస్ ను కోహ్లీ బయటపెట్టాడు.
Read Also: IPL 2024: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈసారి ఇండియాలోనే ఐపీఎల్