SRH Schedule 2024: ఫ్యాన్స్ గెట్ రెడీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే! ఉప్పల్‌లో ఎన్ని మ్యాచ్‌లంటే?

SRH To Play 4 Matches in First Leg of IPL 2024 Schedule: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 షెడ్యూల్‌ను గురువారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విడుదల చేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2024కు సంబందించిన ఫస్టాఫ్ షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మిగతా షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించనుంది. మార్చి 22న ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెన్నైలో తలపడనున్నాయి.
తెలుగు టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ ఆడనుంది. ఫస్టాఫ్ షెడ్యూల్ ప్రకారం.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు మాత్రమే జరగనున్నాయి. మార్చి 27న ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లను సొంత మైదానంలో సన్‌రైజర్స్ ఆడనుంది.
ఇక ఐపీఎల్ 2024 ఫస్టాఫ్ షెడ్యూల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 4 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో రెండు హోమ్ గ్రౌండ్‌లో, మరో రెండు ఆవలి గ్రౌండ్‌లో ఆడనుంది. ఫస్టాఫ్ షెడ్యూల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది.
Also Read: WPL 2024: నేటి నుంచే డబ్ల్యూపీఎల్ 2024.. తొలి మ్యాచ్‌లో ముంబై, ఢిల్లీ ఢీ!
సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్:
మార్చి 23 – కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ హైదరాబాద్ – కోల్‌కతా (రాత్రి 7.30 గంటలకు)
మార్చి 27 – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ – హైదరాబాద్ (రాత్రి 7.30 గంటలకు)
మార్చి 31 – గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ – అహ్మదాబాద్ (రాత్రి 7.30 గంటలకు)
ఏప్రిల్ 5 – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ – హైదరాబాద్ (రాత్రి 7.30 గంటలకు)