Leading News Portal in Telugu

IPL 2024: సీఎస్కే జట్టుకు వరుస షాక్‌లు.. మరో స్టార్‌ ఆటగాడికి గాయం..?



Csk

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్‌ ఆల్‌ రౌండర్లు శివమ్‌ దుబే, డార్లీ మిచెల్‌ గాయాలతో ఇబ్బంది పడుతుండగా.. తాజాగా మరో న్యూజిలాండ్ స్టార్లు డెవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర గాయపడ్డారు. ఆస్ట్రేలియాతో తొలి టీ20 సందర్భంగా రచీన్ రవీంద్ర ఎడమ కాలికి గాయం కావడంతో అతడు రెండో టీ20కు దూరం అయ్యాడు.

Read Also: CM Revanth Reddy: నేడు ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం

అయితే, రెండో టీ20లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే సైతం గాయపడ్డాడు. కీపింగ్ చేస్తుండగా బంతిని అందుకునే క్రమంలో ఎడమ చేతి బొటనవేలికి గాయం అయింది. దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వదిలి వెళ్లాడు. ఇక, స్కానింగ్‌కు తరలించగా ఫ్రాక్చర్‌ ఉన్నట్లు వెల్లడైంది. దీంతో అతడు మూడో టీ20కు దూరం అయ్యాడు. కాన్వే స్ధానంలో టిమ్‌ సీఫర్ట్‌ జట్టులోకి వచ్చాడు.

Read Also: Group2 Exam: రేపు గ్రూప్‌-2 పరీక్ష.. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా వసతులు

ఇక, ఐపీఎల్‌ ఆరంభ సమయానికి డెవాన్ కాన్వే పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అతడితో పాటు డార్లీ మిచెల్‌, రవీంద్ర కూడా పూర్తిగా కోలుకోనున్నట్లు పలు రిపోర్ట్‌లో పేర్కొన్నాయి. కాగా, ఈ ఏడాది ధానాదన్‌ లీగ్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్‌ వేదికగాచెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.