Leading News Portal in Telugu

IPL 2024: ఐపీఎల్ యాడ్ వీడియోలు లీక్.. హార్దిక్, పంత్ యాక్షన్ మాములుగా లేదు



Hardhik

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 షూటింగ్ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తనకు వడ్డించిన ఆహారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సెట్‌లో ఉన్న వ్యక్తులపై మండిపడ్డాడు. వన్డే ప్రపంచ కప్ 2023 సమయంలో చీలమండ గాయం బారిన పడిన పాండ్యా.. టోర్నీ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆటకు దూరంగా ఉంటూ, తన సోదరుడు కృనాల్, సహచరుడు ఇషాన్ కిషన్‌(ముంబై ఇండియన్స్)తో కలిసి కఠిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఫిట్‌నెస్‌ను తిరిగి పొందడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ డైట్ మెయింటెయిన్ చేస్తున్నాడు. కాగా.. హార్దిక్ ఐపీఎల్ యాడ్ ఫిల్మ్ షూటింగ్ సెట్స్‌లో పాల్గొనగా.. అతనికి సాంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించారు.

Read Also: CM Revanth : ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

పాండ్యాకు మధ్యాహ్న భోజనంలో ధోక్లా, జిలేబీ వడ్డించారు. ఈ ఆహారం తన ఫిట్‌నెస్‌కు మంచిది కాదని చెప్పాడు. ‘నా డైట్ గురుంచి తెలియదా..! నా సిబ్బందిని అడిగి తెలుసుకో..’ అంటూ సెట్‌లో ఉన్న వ్యక్తులపై పాండ్యా గట్టిగా అరిచాడు. భయ్యా.. నేను ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం ముఖ్యం! ఇలాంటివి ఎలా తింటాననుకున్నావు? ఈ ఆహార పదార్థాలను ఎవరు పంపించారు?’’ అని హార్దిక్‌ పాండ్యా భోజనం వడ్డించిన వ్యక్తిని ప్రశ్నించాడు. అయితే.. ఇందుకు అతడు ఈ ఒక్కరోజుకు సర్దుకోండి సర్ అని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ‘‘సర్‌.. ప్లీజ్‌ ఏదో ఒకటి తినండి. లేదంటే మీ స్టామినా తగ్గిపోతుంది’’ అని పాండ్యాతో చెప్పాడు. ప్రతిస్పందనగా.. ‘‘భయ్యా.. నేను ఈ ఫుడ్‌ తిన్నానంటే నాకు శక్తి రావడం కాదు.. ఉన్నది కూడా పోతుంది’’ అని పాండ్యా బదులిచ్చాడు.

Read Also: Fuel prices: త్వరలో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం.. హింట్ ఇచ్చిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి..

మరోవైపు.. రిషభ్‌ పంత్‌ కూడా అసహనానికి గురైనట్లుగా మరో వీడియోలో ఉంది. ‘‘ఏడుపు రాకుండా ఎలా ఏడవాలయ్యా..? డైరెక్టర్‌ను పిలవండి. స్క్రిప్ట్‌ మార్చండి’’ అని అన్నాడు. వీరితో పాటు శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ పాల్గొన్న యాడ్‌ వీడియోలు కూడా లీక్‌ అయ్యాయి. ధోతీ నచ్చలేదని అయ్యర్‌, స్క్రిప్ట్‌ను ఎలా గుర్తు పెట్టుకోవాలని రాహుల్ ఫైర్ అయినట్లుగా వీడియోల్లో ఉంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా.. ప్రచారం కోసమే వీటిని లీక్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.