Leading News Portal in Telugu

IND vs ENG 4th Test: గెలుపు వాకిట‌ త‌డ‌బ‌డుతున్న టీమిండియా.. విజయానికి ఎంత కావాలంటే?



Team India Test

రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో గెలుపు దిశ‌గా సాగుతున్న భార‌త జ‌ట్టు ఒక్కసారిగా తడబడింది. ఇంగ్లండ్‌ స్పిన్నర్ల దాటికి స్వల్ప వ్యవధిలో 5 వికెట్స్ కోల్పోయింది. ప్ర‌స్తుతం శుభ్‌మ‌న్ గిల్, ధృవ్ జురెల్‌లు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఈ ఇద్దరు ఆచితూచి ఆడుతున్నారు. భార‌త్ విజ‌యానికి ఇంకా 40 ప‌రుగులు కావాలి. మరోవైపు సిరీస్ స‌మం చేసేందుకు ఇంగ్లండ్‌కు మ‌రో 5 వికెట్లు అవ‌స‌రం. దాంతో నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది.

ఓవర్ నైట్ స్కోర్ 40/0తో నాలుగో రోజు ఆరంబించిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ధాటిగా ఆడారు. జో రూట్‌ వేసిన బంతికి యశస్వి (37) భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ (55) టామ్‌ హార్ట్‌లీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ముందుకొచ్చి ఆడబోయి రోహిత్‌.. స్టంపౌట్‌ అయ్యాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న రజత్‌ పటీదార్‌ (0) బషీర్‌ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 100 పరుగులకు భారత్‌ మూడు వికెట్‌లను కోల్పోయింది.

Also Read: Sara Arjun: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న జూనియర్ ఐశ్వర్య రాయ్‌!

ఓ వైపు వికెట్స్ పడుతున్నా.. శుభ్‌మన్ గిల్ క్రీజులో పాతుకుపోయాడు. లంచ్‌ బ్రేక్ సమయానికి భారత్ 37 ఓవర్లలో మూడు వికెట్స్ కోల్పోయి 118 రన్స్ చేసింది. లంచ్‌ తర్వాత భారత్‌కు డబుల్ షాక్‌ తగిలింది. బషీర్‌ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా (4), సర్ఫరాజ్‌ ఖాన్ (0) ఔట్ అయ్యారు. 5 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను గిల్, ధ్రువ్‌ జురెల్ ఆదుకున్నారు. ఇద్దరు బౌండరీలు పోకుండా.. సింగిల్స్ తీస్తూ టీమిండియాను లక్ష్యం వైపు నడిపిస్తున్నారు.