Leading News Portal in Telugu

IND vs ENG 4th Test: ఆదుకున్న గిల్, ధ్రువ్‌.. నాలుగో టెస్టులో భారత్ విజయం! సిరీస్ కైవసం



India Win Test

Dhruv Jurel, Shubman Gill star in IND vs ENG 4th Test: రాంచీ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనను 104.5 ఓవర్లలో ఐదు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. కష్టాల్లో పడిన భారత జట్టును యువ ఆటుగాళ్లు శుభ్‌మన్‌ గిల్ (52), ధ్రువ్ జురెల్ (39) చివరి వరకూ క్రీజ్‌లో ఉండి విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది. చివరి టెస్ట్ ధర్మశాలలో మార్చి 7 నుంచి ఆరంభం కానుంది.

ఓవ‌ర్ నైట్ స్కోర్ 40/0తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్ జట్టు అనూహ్యంగా త‌డ‌బ‌డింది. అందరూ ఊహించినట్లే నాలుగో రోజు బంతి ట‌ర్న్ కావ‌డంతో.. షోయబ్ బ‌షీర్, టామ్‌ హార్ట్‌లీలు చెలరేగారు. ఈ ఇద్దరి ధాటికి భారత్ 16 ప‌రుగుల వ్య‌వ‌ధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 84 ప‌రుగుల వ‌ద్ద య‌శ‌స్వీ జైస్వాల్ (37) ఔట్ కాగా.. హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శ‌ర్మ‌ (55) హార్ట్‌లీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ర‌జ‌త్ పాటిదార్ (0) డ‌కౌట్ కావ‌డంతో 100 ప‌రుగుల‌కే మూడు కీలక వికెట్స్ కోల్పోయింది. ఈ దశమలో రవీంద్ర జ‌డేజా (4), గిల్‌లు నాలుగో వికెట్‌కు 71 బంతుల్లో 20 ర‌న్స్ చేశారు. దాంతో 118/3తో భారత జట్టు లంచ్‌కు వెవెళ్ళింది.

Also Read: Sara Arjun: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న జూనియర్ ఐశ్వర్య రాయ్‌!

లంచ్‌ తర్వాత భారత్‌కు డబుల్ షాక్‌ తగిలింది. షోయబ్ బషీర్‌ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా (4), సర్ఫరాజ్‌ ఖాన్ (0) ఔట్ అయ్యారు. 120 పరుగులకే 5 వికెట్స్ కోల్పోయి భారత జట్టు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో అటాక్ చేయించాడు. దాంతో బౌండ‌రీలు రావడ‌మే గ‌గ‌న‌మైంది. గిల్, ధ్రువ్‌ సింగిల్స్, డ‌బుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేశారు. ఏంటో ఓపికగా ఆడిన గిల్.. రెండు సిక్స‌ర్ల‌తో ఫిఫ్టీ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచ‌రీతో జ‌ట్టును ఒడ్డున ప‌డేసిన ధ్రువ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు అద్భుత బ్యాటింగ్ తో భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.

స్కోర్లు:
ఇంగ్లండ్‌ – 353 ,145
ఇండియా- 307, 192/5