Leading News Portal in Telugu

Rohit Sharma: ఐపీఎల్ 2024 ట్రేడ్ విండో క్లోజ్.. ముంబైకే ఆడనున్న రోహిత్ శర్మ!



Rohit Sharma Mi

Rohit Sharma will play for Mumbai Indians in IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం సమయంలో ముంబై ఇండియన్స్ ప్రాంచైజీలో మార్పులు జరిగిన విషయం తెలిసిందే. ముంబైకి ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్‌ పాండ్యాను సారథిగా నియమించింది. దాంతో రోహిత్ వేరే జట్టుకు వెళ్లిపోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు హిట్‌మ్యాన్‌ను ట్రేడింగ్ చేసేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి కూడా చూపాయి. అయితే రోహిత్‌ను వదులుకోవడానికి ముంబై ఫ్రాంచైజీ ఇష్టపడలేదు.

తాజాగా ఐపీఎల్ 2024 ట్రేడ్ విండో క్లోజ్ అయ్యింది. గత డిసెంబర్‌లో జరిగిన మినీ వేలం తర్వాత ఓపెన్ అయిన ట్రేడ్ విండో.. ఐపీఎల్ షెడ్యూల్ రావడంతో క్లోజ్ అయింది. దీంతో 17వ సీజన్‌లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరఫునే బరిలోకి దిగనున్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ తొలిసారి ఆడనున్నాడు. ఇక వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ప్రాంచైజీ రోహిత్‌ను వదిలేస్తుందని తెలుస్తోంది. ఐపీఎల్ 2025 వేలంలోకి హిట్‌మ్యాన్ రావడం దాదాపు ఖాయం అయినట్టే.

Also Read: Rohit Sharma: రోహిత్‌ శర్మ జైత్రయాత్ర.. 17 సిరీస్‌ల్లో వరుస విజయాలు!

2013 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియమించబడ్డాడు. అదే ఏడాది ముంబైకి అతడు మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్‌ అందించాడు. 2015, 2017, 2019, 2020లో ముంబైకి హిట్‌మ్యాన్‌ టైటిల్స్ అందించాడు. రోహిత్ నాయకత్వంలో ముంబై 87 మ్యాచ్‌లు గెలిచి, 67 మ్యాచ్‌లలో ఓడిపోయింది. రోహిత్ గత సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 332 పరుగులు చేశాడు. ఈ సరి కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగనున్న అతడు రెచ్చిపోయే అవకాశం ఉంది.