Leading News Portal in Telugu

Rohit Sharma: మాజీ క్రికెటర్‌ రోహిత్ శర్మ కన్నుమూత



Rohit Sharma

Rohit Sharma: రాజస్థాన్‌ క్రికెట్‌లో విషాదం నెలకొంది. ఆ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ(40) మృతి చెందారు. గత కొంతకాలంగా లివర్‌ సమస్యలతో బాధపడుతున్న రోహిత్ శర్మ.. జైపూర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో శనివారం తుదిశ్వాస విడిచారు. నాలుగైదు రోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో భారీ వర్షాలు.. 37 మంది మృతి..

2004 నుంచి 2014 వరకు ఆయన రాజస్థాన్‌ తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. 2014లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ఆర్‌ఎస్ క్రికెట్‌ అకాడమీని స్థాపించి, కోచ్‌గా సేవలందిస్తున్నారు. ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆయన శిక్షణ ఇచ్చారు. కుడిచేతి వాటం ఓపెనింగ్‌ బ్యాటర్‌, లెగ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన రోహిత్‌ 2004-2014 మధ్యలో రాజస్థాన్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. రోహిత్‌ రాజస్థాన్‌ తరఫున 7 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 28 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 4 టీ20లు ఆడారు. రోహిత్‌ ఖాతాలో రెండు లిస్ట్‌-ఏ సెంచరీలు ఉన్నాయి.