Leading News Portal in Telugu

Ellyse Perry Six: ఎల్లీస్‌ పెర్రీ భారీ సిక్సర్.. కారు అద్దం బద్దలు! వీడియో వైరల్



Ellyse Perry Car Glass

Ellyse Perry’s Huge Six Breaks Car Window: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2024లో అనుహ్య సంఘటన చోటు చేసుకుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు స్టార్ ప్లేయర్ ఎల్లీస్‌ పెర్రీ కొట్టిన ఓ సిక్సర్‌ దెబ్బకు సందర్శన కోసం ఉంచిన కారు అద్దం పగిలిపోయింది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ వేసిన చివరి బంతిని పెర్రీ లాంగాన్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచింది. బంతి నేరుగా వెళ్లి డిస్‌ప్లే బాక్స్‌లో ఉన్న కారు అద్దానికి తగిలింది. దీంతో కారు అద్దం పూర్తిగా పగిలిపోయింది.

కారు అద్దం పగిలిపోగానే ఎల్లీస్‌ పెర్రీ ఒక్కసారిగా తలపట్టుకున్నారు. పెర్రీ తన తలపై చేతులు పెట్టుకుని.. అయ్యో అన్నట్లు రియాక్షన్‌ ఇచ్చింది. మరోవైపు మైదాంలోని ఫాన్స్ కూడా షాక్ తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. డబ్ల్యూపీఎల్ 2024 పూర్తయిన తరువాత ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు’గా ఈ కారును ఇస్తారు. ఇప్పుడు కారు అద్దం పగలడంతో మరో కారుని ఆ స్థానంలో ఉంచనున్నారు.

Also Read: Mahesh Babu-Rajamouli: రాజమౌళి సినిమా.. మహేశ్‌ బాబు ఎనిమిది గెటప్స్ రెడీ!

బెంగళూరు వేదికగా యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. స్మృతి మంధాన (80; 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎల్లీస్ పెర్రీ(58; 37 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. ఛేదనలో వారియర్జ్‌ 8 వికెట్లకు 175 పరుగులే చేసింది. అలిస్సా హీలీ (55) హాఫ్ సెంచరీ చేయగా.. దీప్తి శర్మ 33 రన్స్ చేసింది.