Leading News Portal in Telugu

ISPL 2024: కమెడియన్‌ చేతిలో ఔటైన సచిన్‌.. ఎలానో తెలుసా..?



Sachin

దిగ్గజ బ్యాటర్‌ మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ ( Sachin Tendulkar ) అభిమానులకు చేదువార్త. సుమారు మూడు దశాబ్దాల పాటు భారత క్రికెట్‌కు కర్త, కర్మ, క్రియగా నిలిచిన సచిన్‌.. ఓ కమెడియన్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇవాళ (బుధవారం) థానే (మహారాష్ట్ర) లో మొదలైన ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ISPL )లో ఈ ఇది చోటు చేసుకుంది. స్టాండప్‌ కమెడియన్‌గానే గాక గతేడాది హిందీ బిగ్‌ బాస్‌ విన్నర్‌ అయిన మునావర్‌ ఫారుఖీ ( Munawar Faruqui ) బౌలింగ్‌లో సచిన్‌ పెవిలియన్ బాట పట్టాడు. అయితే, టెన్నిస్‌ బాల్‌తో ఆడుతున్న ఈ టోర్నీ టీ10 రూపంలో కొనసాగుతుంది.

Read Also: Realme 12 Series Launch : రియల్‌మి నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు.. ఫీచర్స్, ధర?

కాగా, ఈ టోర్నీమెంట్ లో సచిన్‌ టెండూల్కర్‌ సారథ్యంలోని టీమ్‌ మాస్టర్స్‌ ఎలెవన్‌ టీమ్.. హిందీ నటుడు అక్షయ్‌ కుమార్‌ ( Akshay Kumar ) సారథ్యంలోని టీమ్‌ ఖిలాడీతో పోటీ పడుతుండగా ఈ మ్యాచ్‌లో సచిన్‌ 16 బంతుల్లోనే 30 రన్స్ చేశాడు. ఇక, ఫరూఖీ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి భారీ షాట్‌ ఆడబోయిన టెండూల్కర్.. మరో భారత మాజీ క్రికెటర్‌ నమన్‌ ఓజా చేతికి చిక్కి ఔట్ గా వెనుదిరిగాడు. కాగా, ఈ మ్యాచ్‌లో సచిన్‌.. జమ్మూకాశ్మీర్‌కు చెందిన పారా క్రికెటర్‌ అమిర్‌ హుస్సేన్‌తో కలిసి బ్యాటింగ్‌ కూడా చేశాడు. గత నెలలో సచిన్‌.. అమిర్‌కు బ్యాట్‌ ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అమిర్‌ జమ్మూకాశ్మీర్‌ పారా క్రికెట్‌ టీమ్‌కు సారథిగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్.. అమిర్‌ పేరుతోనే ఉన్న జెర్సీని ధరించడం గమనార్హం.