Leading News Portal in Telugu

Viral Video: ఆర్సీబీ మహిళల జట్టుతో కలిసి డ్యాన్స్ చేసిన విరాట్..!



1

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఐపీల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ టీం తొలి టైటిల్‌ ను కైవసం చేసుకుంది. విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే.., ఆర్సీబీ ప్లేయర్లు రిచా ఘోష్, క్రీజులో అవతలి ఎండ్‌ లో ఉన్న ఎల్లీస్ పెర్రీని కౌగిలించుకోవడానికి మైదానానికి పరిగెత్తడంతో డ్రెస్సింగ్ రూమ్‌ లో పార్టీ మొదలయింది. ఇంతలోనే, అరుణ్ జైట్లీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం తర్వాత వీడియో కాల్ చేసిన స్టార్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ సంబరాలని మరింత పెంచాడు.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఆర్సీబీ ఆటగాళ్లు కూడా అతనితో జతకట్టడంతో విరాట్ కోహ్లీ ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నట్టు వీడియో కాల్ లో కనిపించింది. మరోవైపు కోహ్లీ 2008లో ఐపీల్ ప్రారంభించినప్పటి నుండి ఫ్రాంచైజీలో భాగంగా ఉన్నాడు. ఇందులో మూడు సార్లు ఫైనల్ చేరినప్పటికీ.. టీం మాత్రం కప్ గెలవలేకపోయింది. కాకపోతే ఇప్పుడు మహిళల జట్టు ఆ పనిని పూర్తి చేసి ఆర్సీబీ చరిత్రలో మొదటి టైటిల్‌ ను గెలుచుకోవడం పట్ల కోహ్లీ ఉప్పొంగిపోయాడు.

Also Read:SIM Card Rules: మొబైల్ వినియోగదారులకు కొత్త రూల్స్ వచ్చేశాయ్!

మొదటగా బ్యాటింగ్‌ కు దిగిన ఢిల్లీ షఫాలీ వర్మ, మెగ్ లానింగ్ శుభారంభం చేసింది. వీరిద్దరూ కలిసి 64 పరుగుల భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు. అయితే షఫాలీ ఔట్ అయిన వెంటనే, వికెట్లు పేకమేడలా పడిపోయాయి. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులు చేయడంతో వారి ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌ లో స్కోరు చేశారు. బౌలింగ్ లో సోఫీ మోలినక్స్ 3 వికెట్లు తీయగా.. శ్రేయాంక పాటిల్ నాలుగు వికెట్లు తీయడంతో తక్కువ పరుగులకే పరిమితం చేసారు.