
Virat Kohli: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అన్బాక్స్ ఈవెంట్లో ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో కింగ్ కోహ్లీ అనుభూతి ఎలా ఉంది అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ప్రేక్షకులు కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు చేశారు.. తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ మీరంతా ప్రశాంతంగా ఉండండి.. మేము త్వరగా చెన్నైకి వెళ్లాలి.. మీరు ( యాంకర్ ను ఉద్దేశించి ) నన్ను కింగ్ అని పిలిస్తే ఇబ్బందిగా ఉంటుంది.. జస్ట్ విరాట్ అని పిలవండి అని కోహ్లీ పేర్కొన్నారు.
Read Also: Samantha Ruth Prabhu: సిటాడెల్ టీజర్ చూశారా.. యాక్షన్ అదరగొట్టిన సామ్
ఇక, ఆర్సీబీ మహిళల ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకోవడంపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. ఈ ఏడాది బెంగళూరు టైటిళ్ల సంఖ్యను డబుల్ చేస్తామన్నారు. ఉమెన్స్ ఆర్సీబీ జట్టు టైటిల్ గెలిచినప్పుడు తామందరం మ్యాచ్ చూస్తున్నాం.. ఆ టైంలో ఆర్సీబీ అభిమానుల స్వచ్ఛమైన ప్రేమను ఫీలయ్యామన్నారు. బెంగళూరు టైటిల్ గెలిచిన క్షణాన బెంగళూరు నగరమే టైటిల్ గెలిచిన ఫీలింగ్ కలిగిందని అతడు పేర్కొన్నారు. ఇన్నేళ్ల పాటు అభిమానులు మాపై ఉంచిన నమ్మకాన్ని త్వరలోనే డబుల్ చేస్తామని కోహ్లీ ధీమా వ్యక్తం చేశారు. 16 ఏళ్లలో తాను ఎప్పుడు టైటిల్ గెలవాలనే దృడ సంకల్పంతోనే వచ్చానన్నారు.. అందు కోసం శాయశక్తుల కృషి చేశాన్నారు. ఐపీఎల్ టైటిల్ తొలిసారి గెలిచిన ఆర్సీబీ టీమ్ లో ఉండాలన్నదే నా కోరిక.. అభిమానులు, ఫ్రాంచైజీకి సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోనూ.. టైటిల్ గెలిచి వీరి రుణాన్ని తీర్చుకుంటానని విరాట్ కోహ్లీ చెప్పారు.
Read Also: Bihar: పట్టాలు తప్పిన ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న రైలు..
కాగా, అన్బాక్స్ ఈవెంట్ ప్రారంభానికి ముందు మహిళల ఐపీఎల్ ఛాంపియన్స్ ఆర్సీబీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన పురుషుల ఆర్సీబీ బృందంలో విరాట్ కోహ్లి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా విరాట్.. సహచరులతో కలిసి చప్పట్లు కొడుతూ ఛాంపియన్స్ను మైదానంలోకి ఆహ్వానించారు. ఇక, మహిళా క్రికెటర్లతో కలిసి విరాట్ కోహ్లీ ఫోటోలకు ఫోజులిచ్చాడు. అలాగే, చిన్నస్వామి స్టేడియం మొత్తం కోహ్లీ నామస్మరణతో మార్మోగిపోయింది. ఐపీఎల్ 2024 సీజన్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.
God of masses @imvkohli
pic.twitter.com/XtQ0NX6jLz
— ` (@chixxsays) March 19, 2024