Leading News Portal in Telugu

IPL Tickets: అరె ఏంట్రా ఇది.. నిమిషాల్లోనే ముగిసిన ఐపీఎల్‌ టిక్కెట్ల అమ్మకాలు..!



9 Ipl

ఎప్పుడెప్పుడా అంటూ భారతీయ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపిఎల్ 17వ సీజన్ మార్చి 22న మొదలు కాబోతోంది. ఈ సీజన్ సంబంధించి మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మార్చి 22 సాయంత్రం 7:30 గంటలకు నుంచి చెన్నై వేదికన చిదంబరం స్టేడియంలో మ్యాచ్ మొదలు కాబోతుంది. ఇందుకు సంబంధించి ఐపీఎల్‌ టిక్కెట్లు హాట్‌ కేకుల్లా అమ్మకం జరిగాయి. ఆన్‌ లైన్‌ లో విండో ఓపెన్‌ అవ్వగానే కొన్ని క్షణాలలోనే అయిపోయాయి టికెట్స్.

చిదంబరం స్టేడియంలో ప్రారంభ మ్యాచ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మొదలు కానుండగా ఈ పోటీల కోసం సోమవారం ఉదయం కేవలం ఆన్‌ లైన్‌ లో మాత్రమే టిక్కెట్లను విక్రయించారు. ఇందుకు సంబంధించి ఆన్‌ లైన్‌ లో టిక్కెట్ల విక్రయ విండో ఓపెన్‌ చేయగానే క్షణాల్లో టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక్కడ ఓ వ్యక్తికి రెండు టిక్కెట్లు మాత్రమే ఇచ్చినప్పటికీ.. ఈ సేల్ ప్రారంభమైన వెంటనే అమ్ముడుపోయినట్టు నిర్వాహకులు తెలిపారు.

ఇక మ్యాచ్ కోసం స్టేడియంలోని C, D, E గ్యాలరీల్లోని లోయర్ గ్యాలరీల్లోని ఎగువభాగం టిక్కెట్లను రూ.4 వేలుగా నిర్ణయించారు. అయినా కానీ.. అభిమానులు తగ్గేదెలా అన్నట్టు టిక్కెట్లనూ కొనేశారు. ఇక I, J, K గ్యాలరీల్లోని లోయర్ టిక్కెట్ల ధరను రూ.4500, ఈ గ్యాలెరీల్లోని అప్పర్ సీట్లకు సంబంధించిన టిక్కెట్ల ధరను రూ.4000 గా నిర్ణయించారు. అలాగే కలైంజర్‌ కరుణానిధి గ్యాలరీ టిక్కెట్ల ధరను రూ.7500 కు ఉంచినా కూడా అవి కూడా పూర్తిగా అమ్ముడపోయాయి. మొదటి మ్యాచ్‌ రోజున స్టేడియంలోకి ప్రేక్షకులను సాయంత్రం 4.30 గంటల నుండే అనుమతిస్తామని చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు అధికారి వెల్లడించారు.