Leading News Portal in Telugu

RCB UNBOX EVENT: దద్దరిల్లిన ఆర్సీబీ అన్‍బాక్స్ ఈవెంట్…నెవర్ గివప్ అంటూ…!



RCB UNBOX EVENT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 మరో రెండు రోజుల్లో మార్చి 22న ఈ సీజన్ ప్రారంభం కానుంది.ఈ సీజన్‍కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) “Get Ready To Fight We Never Give Up” అంటు ఫుల్ జోష్‍తో సిద్ధమవుతోంది.IPL2024 లో నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన అన్‍బాక్స్ ఈవెంట్ లో ప్రముఖ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా అలెన్ వాకర్ కంపోజ్ చేసిన ఆర్సీబీ యాంథమ్ ప్రేక్షకులను ఉర్రూతలు ఉగిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏమిటి అంటే సాంగ్ లో లిరిక్స్ కన్నడ భాషలో కూడా కంపోజ్ చేయడం అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా వేదికగా ట్రేడింగ్ లో ఉంది.ఇక WPL 2024 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు టైటిల్ దక్కించుకుంది. 16 ఏళ్ల చరిత్రలో తొలి సారి ఈ ఫ్రాంచైజీకి ఓ టైటిల్ కైవసం చేసుకుంది. డబ్ల్యూపీఎల్ రెండో ఎడిషన్‍లోనే టైటిల్ దక్కించుకుంది వుమెన్స్ టీమ్. దీంతో అన్‍బాక్స్ ఈవెంట్‍కు గ్రాండ్ వెల్కమ్ తో హాజరైన స్మృతి మంధాన సారథ్యంలోని మహిళల టీమ్‍ను పురుషుల జట్టుని గౌరవించి వారికి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చింది.

Also Read; Pushpa2: పుష్ప 2లో రష్మిక లుక్ లీక్.. ఎంత అందంగా ఉందో చూశారా..?

గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఆర్సీబీ అన్‍బాక్స్ ఈవెంట్‍ అలెన్ వాకర్ సాంగ్స్ తో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఆర్సీబీ.. ఆర్సీబీ అనే అరుపులతో చిన్నస్వామి స్టేడియం మొత్తం హోరెత్తించారు ఫాన్స్. అన్‍బాక్స్ ఈవెంట్‍కు హాజరైన వేలాది మంది ఫాన్స్ ఒక్కసారిగా ఆర్సీబీ నినాదాలతో సందడి చేశారు. ఓ దశలో స్టేడియంలో లైట్లన్నీ ఆఫ్ చేయగా.. ప్రేక్షకులందరూ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్లను ఆన్ చేసిన దృశ్యం ఆకట్టుకుంది. ఇక మార్చి 22న ఐపిఎల్ 17వ ఎడిషన్ తొలి మ్యాచ్‍లో డిఫెండింగ్ ఛాంపియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆర్సీబీ తలపడనుంది. ఈ సీజన్లో ఆర్సీబీ మెన్స్ టీం కూడా కప్ కొట్టాలి అని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు.