Leading News Portal in Telugu

IPL 2024: ఐపీఎల్‌ ఓపెనింగ్‌ సెర్మనీలో పెర్ఫార్మ్‌ చేసేది వీళ్లే..!



Ipll

IPL 2024 Opening Ceremony: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌- 2024 మరి కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌ చె న్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ నెల 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. మార్చ్ 22వ తేదీన రాత్రి 7:30 గంటలకు ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది.

Read Also: Karthika Deepam Season 2: ఇదెక్కడి క్రేజ్ మావా.. సీరియల్ కి ప్రీ రిలీజ్ ఈవెంటా?

కాగా, ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌ కావడంతో మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్‌ సెర్మనీని ఐపీఎల్ నిర్వహకులు అరేంజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌, సంగీత మాంత్రికుడు ఏఆర్‌ రెహ్మాన్‌, సింగర్‌ సోనూ నిగమ్‌ పెర్ఫార్మ్‌ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ మ్యాచ్‌ ప్రారంభానికి గంట ముందు జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని స్టార్‌ స్పోర్ట్స్‌, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

Read Also: Sadhguru: సద్గురు జగ్గీవాసుదేవ్‌కు బ్రెయిన్‌ సర్జరీ

ఇదిలా ఉండగా.. సీఎస్‌కే- ఆర్సీబీ మధ్య హెడ్‌ టు హెడ్‌ రికార్డులను మనం పరిశీలించినట్లైతే.. ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్‌లో 31 సార్లు ప్రత్యేక్షంగా పోటీగా.. సీఎస్‌కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాగా.. ఓ మ్యాచ్‌ టై అయింది. ఇక, చెపాక్‌ స్టేడియం విషయానికి వస్తే.. ఈ గ్రౌండ్ లో ఆర్సీబీపై సీఎస్‌కే పూర్తి ఆధిపత్యం ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 సార్లు తలపడగా.. సీఎస్‌కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో గెలిచింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే బెంగళూరు జట్టు విజయం సాధించింది.