Leading News Portal in Telugu

IPL 2024: ఔను వాళ్లిద్దరు కలిసిపోయారు.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!



Pandya

ఇవాళ ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాను కౌగిలించుకున్నాడు. అయితే, నిన్న రోహిత్ ఎంఐ టీమ్ తో చేరాడు.. ఈ సందర్భంగా ఇవాళ తన మొదటి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా రోహిత్ వద్దకు వెళ్లి అతడ్ని కౌగిలించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, హార్దిక్ పాండ్యా ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. అతను IPL 2024 మినీ-వేలానికి ముందు ట్రేడ్ ద్వారా ముంబైలో చేరాడు.. దీంతో అతడికి జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఎంఐ యాజమాన్యం అప్పగించింది. ఇక, హార్దిక్ పాండ్య IPL 2022, 2023లో గుజరాత్ టైటాన్స్ టీమ్ కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Read Also: Jaishankar: “నెహ్రూ అమెరికా వ్యతిరేకి”.. కాంగ్రెస్ విదేశాంగ విధానంపై జైశంకర్..

ఇక, తొలి ప్రాక్టీస్ సెషన్స్ లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత సారథి హర్థిక్ పాండ్య కలుసుకోవడంతో ముంబై ఇండియన్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బేషజాలు లేకుండా ఇద్దరూ కలిసి ఆడి ముంబైకి 6వ ట్రోఫీ అందించాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ ఐపీఎల్ లో హర్థిక్ పాండ్య కెప్టెన్సీలో హిట్ మ్యాన్ తొలిసారి ఆడబోతున్నాడు.