Leading News Portal in Telugu

CSK: మ్యాచ్కు ముందు చెన్నైకి భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్..!



Pathirana

ఐపీఎల్ ప్రారంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అయితే.. మ్యాచ్ కు ముందు చెన్నైకి భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ బౌలర్, డెత్‌ ఓవర్స్‌ స్పెషలిస్ట్‌, శ్రీలంక పేస్‌ సంచలనం మతీశ పతిరణ లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరంకానున్నట్లు సమాచారం. అయితే.. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ లో పతిరణకు గాయమైంది. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఎన్‌ఓసీ(NOC) ఇవ్వలేదు.

IPL 2024: చెన్నై జట్టులో తెలుగు కుర్రాళ్లు..

కాగా.. సీఎస్కేకు సీజన్ ప్రారంభంలో రెండోదెబ్బ తగిలినట్లైంది. ఇంతకు ముందు సీఎస్కే ఓపెనింగ్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే కూడా గాయం కారణంగా లీగ్‌కు (మే వరకు) దూరమయ్యాడు. అయితే.. అతని స్థానాన్ని భర్తీ చేయడం సులువే అయినప్పటికీ, పతిరణ స్థానాన్ని భర్తీ చేయడం సీఎస్కేకు తలనొప్పిగా మారింది. ఇకపోతే.. కాన్వే స్థానంలో అతని దేశానికే చెందిన రచిన్‌ రవీంద్ర ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి.. పతిరణ స్థానం కోసం బంగ్లా పేసర్‌ ముస్తాఫిజుర్‌, మొయిన్‌ అలీ, శార్దూల్‌ ఠాకూర్‌ పేర్లను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డెత్‌ ఓవర్స్‌ స్పెషలిస్ట్ ముస్తాఫిజుర్‌ కూడా కావడంతో సీఎస్‌కే యాజమాన్యం అతన్ని జట్టులోకి తీసుకునేందుకు సై అనేలా అనిపిస్తుంది.

Lok Sabha Elections 2024: ఏడు దశాబ్ధాల ఎన్నికల చరిత్రలో 14 నుంచి 6కి తగ్గిన జాతీయ పార్టీలు..

మరోవైపు.. మెయిన్ అలీ ఆల్ రౌండర్ కావున అతన్ని కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే.. కెప్టెన్ ధోనీ, బౌలింగ్ కోచ్ బ్రావో శార్దూల్‌ ఠాకూర్‌ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. రేపు.. ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభం కానుంది. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్‌ వేదికగా రేపు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.