Leading News Portal in Telugu

IPL 2024: చెన్నై జట్టులో తెలుగు కుర్రాళ్లు..



Csk

ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ సంగ్రామానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఐపీఎల్ 17 సీజన్ రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. కాగా.. రేపు జరిగే తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. అసలు విషయానికొస్తే.. చెన్నై జట్టులో తెలుగు కుర్రాళ్లు ఆడుతున్నారు. ఏపీకి చెందిన షేక్ రషీద్, తెలంగాణకు చెందిన అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో.. ఈసారి తెలుగుకుర్రాళ్లు ఐపీఎల్ లో మెరవబోతున్నారు.

Nellore Crime: ఘరానా దొంగలు.. కొట్టేసిన బంగారాన్ని ఏం చేశారో తెలిస్తే షాకవుతారు?

చెన్నై టీమ్లో తెలుగు కుర్రాడు షేక్ రషీద్ ఆడుతున్నాడు. అతని స్వస్థలం.. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం. తొమ్మిదేళ్ళ వయసులోనే అండర్‌-14 క్రికెట్‌ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత.. అంతర్ జిల్లా టోర్నీలో శ్రీకాకుళంపై పన్నెండేళ్ల వయస్సులోనే ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. 2017లో అండర్‌-16 లో 674 పరుగులు చేసి ఆ టోర్నీలోనే అత్యధిక రన్నర్‌గా రషీద్ నిలిచాడు. 2018లో అండర్‌-19లో 680 రన్స్‌తో ఇంటర్నేషనల్ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్ గా రికార్డు సాధించాడు. 2021లో వినూ మన్కడ్‌లో ఆరు మ్యాచ్‌లాడిన రషీద్‌.. రెండు సెంచరీలు, రెండు హాఫ్‌ సెంచరీలతో 400కు పైగా రన్స్ చేశాడు. ఛాలెంజర్‌ ట్రోఫీలో ఆడిన రషీద్.. మూడు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ సహా మొత్తం 275 పరుగులు చేశాడు.

Madhya Pradesh: చర్మం ఒలిచి అమ్మకు చెప్పులు కుట్టించిన కొడుకు..

చెన్నై టీమ్లో మరో తెలుగు తేజం మెరవనున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్కి చెందిన అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకున్నారు. అతను.. వికెట్ కీపర్గా, లెఫ్ట్ హ్యాండర్, హార్డ్ హిట్టర్గా అవనీష్ రావు రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రేపు రాత్రి 7.30 ని.లకు చెపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది.