
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్.. మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ముందు ఓ భారీ టార్గెట్ ను ఉంచింది. కోల్ కతా బ్యాటింగ్ లో ముందుగా ఓపెనర్లు.. ఫిలిప్ సాల్ట్ (54) పరుగులతో చెలరేగాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ (2), వెంకటేష్ అయ్యర్ (7), శ్రేయాస్ అయ్యర్ డకౌట్, నితీష్ రాణా (9) పరుగులు చేశారు. ఒకానొక సందర్భంలో 51 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయిన కేకేఆర్.. ఆ తర్వాత వచ్చిన రమన్ దీప్ సింగ్ (35), రింకూ సింగ్ (23) పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇక ఆ తర్వాత బరిలోకి దిగిన ఆండ్రూ రస్సెల్ కేవలం 25 బంతుల్లో 64 పరుగులతో ఊచకోత అంటే ఏంటో చూపించాడు. సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Read Also: Hardeep Puri: ఇంధన ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
ఇక.. సన్ రైజర్స్ బౌలింగ్ లో రస్సెల్ పరుగుల సునామీ ముందు పరుగులు అప్పజెప్పారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో నటరాజన్ 3 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత మయాంక్ మార్కండే 2, ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ సాధించాడు. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు. మార్కో జాన్సెన్ 3 ఓవర్లు వేసి 40 పరుగులు, షాబాజ్ అహ్మద్ ఒక ఓవర్ వేసి 14 పరుగులు ఇచ్చారు.
Read Also: Chiranjeevi: వారందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా!