
ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్-సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరివరకు ఉత్కంఠగా సాగింది. ఉత్కంఠపోరులో కోల్ కతా గెలుపొందింది. 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరలో క్లాసెన్ కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి ఓవర్ లో సన్ రైజర్స్ గెలుస్తుందని అనుకుంటే.. హర్షిత్ రాణా వేసిన బౌలింగ్ లో కీలక క్లాసెన్ (63) వికెట్ తీశాడు. అంతకుముందు షాబాజ్ అహ్మద్ ను ఔట్ చేశాడు. చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండా కమిన్స్ బాల్ మిస్ చేశాడు. దీంతో కేకేఆర్ గెలుపొందింది. ఏదేమైనప్పటికీ కేకేఆర్ బౌలర్లకు మాత్రం హెన్రిక్ క్లాసెన్ ఊచకోత చూపించాడు.
Yarlagadda Venkatarao: టీడీపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం..
209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ లో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ శర్మ (32) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన రాహుల్ త్రిపాఠి (20) పరుగులతో రాణించాడు. ఐడన్ మార్క్రమ్ (18), అబ్దుల్ సమద్ (15), షాబాజ్ అహ్మద్ (16) పరుగులు చేశారు. కేకేఆర్ బౌలింగ్ లో హర్షిత్ రాణా 3 వికెట్లు తీసి సూపర్ హీరోగా నిలిచాడు. ఆ తర్వాత ఆండ్రీ రసూల్ 2.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు.
Chiranjeevi: శ్రీకాంత్ బర్త్ డే.. ఇంటికెళ్లి మరీ సెలబ్రేట్ చేసిన చిరు
మొదటగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. కోల్ కతా బ్యాటింగ్ లో ముందుగా ఓపెనర్లు.. ఫిలిప్ సాల్ట్ (54) పరుగులతో చెలరేగాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ (2), వెంకటేష్ అయ్యర్ (7), శ్రేయాస్ అయ్యర్ డకౌట్, నితీష్ రాణా (9) పరుగులు చేశారు. ఒకానొక సందర్భంలో 51 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయిన కేకేఆర్.. ఆ తర్వాత వచ్చిన రమన్ దీప్ సింగ్ (35), రింకూ సింగ్ (23) పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇక ఆ తర్వాత బరిలోకి దిగిన ఆండ్రూ రస్సెల్ కేవలం 25 బంతుల్లో 64 పరుగులతో ఊచకోత చూపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో నటరాజన్ 3, మయాంక్ మార్కండే 2, ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీశారు.