Leading News Portal in Telugu

IPL 2024: ఐపీఎల్ ఫైనల్ ఆ తేదీనే.. ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగనున్నాయంటే..!



Ipl 2024

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ఈ నెల 21న ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. బీసీసీఐ (BCCI) ఐపీఎల్ 2024 మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసింది.. ఆ షెడ్యూల్ ను త్వరలోనే విడుదల కానుంది.

Ipl New Ad2024

Kavya Maran: ఆ ఆనందం ఎంతో సేపు లేదు.. పాపం కావ్య పాప..!

ఈ రెండు మైదానాల్లో ప్లేఆఫ్ మ్యాచ్‌లు నిర్వహించవచ్చు
మరోవైపు.. ఐపీఎల్ 2024 షెడ్యూల్‌కు సంబంధించి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం, ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుండగా.. రెండో క్వాలిఫయర్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

లీగ్ దశలో మూడు, నాల్గవ స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత క్వాలిఫయర్-1, 2 విజేతల మధ్య ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. బిసిసిఐ సీనియర్ అధికారి ఒకరు.. ఓ వార్తా ఛానల్ తో మాట్లాడుతూ, ‘ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గత ఏడాది డిఫెండింగ్ ఛాంపియన్ (చెన్నై సూపర్ కింగ్స్) సొంత మైదానంలో ప్రారంభ మ్యాచ్, ఫైనల్‌ను నిర్వహించే సంప్రదాయాన్ని అనుసరిస్తోంది.’ ఐపిఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్‌గా అవతరించడంతో నరేంద్ర మోడీ స్టేడియంలో ఓపెనింగ్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి.

Manda Krishna: ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతివ్వాలని ఎమ్మార్పీఎస్ నిర్ణయం

IPL 2024 మొదటి 21 మ్యాచ్‌ల షెడ్యూల్:

1. చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై (చెన్నై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది)
2. పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, చండీగఢ్, (పంజాబ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది)
3. కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా, (కోల్‌కతా 4 పరుగులతో గెలిచింది)
4. రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, మార్చి 24, జైపూర్, 3.30 PM
5. గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్, మార్చి 24, అహ్మదాబాద్, రాత్రి 7.30
6. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్, మార్చి 25, బెంగళూరు, రాత్రి 7.30
7. చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్, మార్చి 26, చెన్నై, రాత్రి 7.30
8. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్, మార్చి 27, హైదరాబాద్, రాత్రి 7.30
9. రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, మార్చి 28, జైపూర్, రాత్రి 7.30
10. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్, మార్చి 29, బెంగళూరు, రాత్రి 7.30
11. లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్, మార్చి 30, లక్నో, రాత్రి 7.30
12. గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, మార్చి 31, అహ్మదాబాద్, మధ్యాహ్నం 3.30
13. ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, మార్చి 31, వైజాగ్, రాత్రి 7.30
14. ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 1, ముంబై, రాత్రి 7.30
15. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 2, బెంగళూరు, రాత్రి 7.30
16. ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, ఏప్రిల్ 3, వైజాగ్, రాత్రి 7.30
17. గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్, ఏప్రిల్ 4, అహ్మదాబాద్, రాత్రి 7.30
18. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 5, హైదరాబాద్, రాత్రి 7.30
19. రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఏప్రిల్ 6, జైపూర్, రాత్రి 7.30
20. ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, ఏప్రిల్ 7, ముంబై, 3.30 PM
21. లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్, ఏప్రిల్ 7, లక్నో, 7.30 PM