Leading News Portal in Telugu

MI vs GT: గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ.. 6 పరుగుల తేడాతో గెలుపు



Gt

ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ పై 6 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హార్థిక్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో విజయం వరించింది. చివరలో మోహిత్ శర్మ కీలకమైన రెండు వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఉమేష్ యాదవ్ కూడా ముంబై కెప్టెన్ హార్థిక్ వికెట్ తీసి గుజరాత్ విజయం నమోదు చేశాడు.

Ipl New Ad2024

ఇక.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ (43) పరుగులతో రాణించినప్పటికీ, ఇషాన్ కిషన్ డకౌట్ తో నిరాశపరిచాడు. ఆ తర్వాత నమన్ ధీర్ (20), ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన డెవాల్డ్ బ్రెవిస్ (46) పరుగులు చేశాడు. ఆ తర్వాత తిలక్ వర్మ (25) ఉన్నంత సేపు కూడా బాగా ఆడాడు. టిమ్ డేవిడ్ (11) పరుగులు చేశాడు. చివరలో హార్థిక్ పాండ్యాపై అన్నీ ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఒక ఫోర్, ఒక సిక్సర్ తో గేమ్ ఆన్ లోకి వచ్చింది. కానీ ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో తెవాటియాకు క్యాచ్ ఔట్ ఇచ్చి దొరికిపోయాడు. దీంతో ముంబై ఓటమి ఖరారైంది. గుజరాత్ బౌలింగ్ లో అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సాయి కిషోర్ కు ఒక వికెట్ దక్కింది.

అంతకుముందు.. మొదటగా బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ (45) పరుగులతో రాణించాడు. చివరలో రాహుల్ తెవాటియా (22) పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోరు అందించారు. గుజరాత్ బ్యాటింగ్ లో ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (19), శుభ్ మాన్ గిల్ (31), అజ్మతుల్లా ఒమర్జాయ్ (17), డేవిడ్ మిల్లర్ (12), విజయ్ శంకర్ (6), రషీద్ ఖాన్ (4) పరుగులు చేశారు. ముంబై బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో చెలరేగాడు. గెరాల్డ్ కోయెట్జీకి 2 వికెట్లు దక్కాయి. పీయూష్ చావ్లా ఒక వికెట్ పడగొట్టాడు.