Leading News Portal in Telugu

RCB vs PBKS: నేడు ఆర్సీబీతో పంజాబ్ ఢీ..



Rcb Vs Pbks

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌లో ఇవాళ (సోమవారం) బెంగళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య పోరు జరగబోతుంది. ఇక, ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇరు జట్లు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, ఆర్‌సీబీ తన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోగా.. శనివారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక, ఈ దెబ్బకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మేనేజ్‌మెంట్‌ జట్టులో కొన్ని మార్పులను చేసే అవకాశం ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌.. దీంతో దానికి అనుకూలమైన జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.

Read Also: EPFO : జనవరిలో ఈపీఎఫ్ఓలోకి ఎనిమిది లక్షలమంది కొత్త సభ్యులు

ఇక, పంజాబ్ కింగ్స్ టీమ్ తొలి మ్యాచ్ లో విజయం సాధించడంతో మంచి ఊపుమీద కనిపిస్తుంది. ఆర్సీబీని సొంత గడ్డపైనే ఓడించి రెండో గెలుపును తమ ఖాతాలో వేసుకోవాలి అని కెప్టెన్ శిఖర్ ధావన్ చూస్తున్నారు. అయితే, పంజాబ్ టీమ్ ఈ మ్యాచ్ లో ఎలాంటి మార్పులు చేయకుండానే మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ జట్టులో స్వల్ప మార్పులను చేయాలని అనుకుంటే మాత్రం ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కి బదులు శశాంక్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.. అలాగే మరోక ఇంపాక్ట్ ప్లేయర్‌ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

Read Also: Gold Price Today : దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?

తుది అంచనా జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (WK), కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌లు: విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, మనోజ్ భాండాగే, సుయాష్ ప్రభుదేసాయి, యష్ దయాల్.

పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (WK), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌లు: రిలీ రోసౌ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, విధ్వత్ కావరప్ప, సికందర్ రజా, క్రిస్ వోక్స్.