- పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు
- టామ్ క్రూజ్ ప్రత్యేక ప్రదర్శన
- బలవంతంగా ముద్దు పెట్టిన మహిళ

A woman grabbed and kissed Tom Cruise: 19 రోజుల పాటు ప్రపంచ అభిమానులను అలరించిన పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిశాయి. విశ్వక్రీడల ముగింపు వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ తన ప్రదర్శనతో 71,500 మంది ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అయితే ముగింపు వేడుకల్లో అతడికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. టామ్ క్రూజ్‌తో ఓ మహిళ సెల్ఫీ దిగుతూ.. అతడికి బలవంతంగా ముద్దు పెట్టింది.
స్టేడ్ డి ఫ్రాన్స్‌లో టామ్ క్రూజ్ తన ప్రదర్శన ముగించుకుని బయటకు వెళుతున్నాడు. ఆ సమయంలో అతడిని అభిమానులు చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఇంతలో ఓ మహిళ ఫొటో తీసుకుంటూ.. నడుస్తున్న టామ్ క్రూజ్‌ను బలవంతంగా లాక్కొని చెంపపై ముద్దు పెట్టింది. ఈ ఘటనతో అక్కడివారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. టామ్ క్రూజ్ మాత్రం నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఆదివారం అర్ధరాత్రి జరిగిన పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో టామ్ క్రూజ్ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చాడు. గాల్లో నుంచి వచ్చి.. డేరింగ్ స్టంట్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. బైక్‌పై ఒలింపిక్ పతాకాన్ని తీసుకొచ్చి.. లాస్ ఏంజిల్స్ మేయర్‌కు అందించాడు. ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు 71,500 మంది హాజరయ్యారు. ఇక 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజిల్స్‌లో జరగనున్నాయి.
How’d that lady almost make out with Tom Cruise on international TV 😂#ClosingCeremony pic.twitter.com/IxtmIUPdcA
— Georgia Rose 🇿🇦 🍉 (@Rasheeda_S) August 11, 2024