Leading News Portal in Telugu

ICC ODI Rankings: మరోసారి అత్యుత్తమ ర్యాంకు సాధించిన ‘హిట్ మ్యాన్’..


  • వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రోహిత్ శర్మ మరోసారి అత్యుత్తమ ర్యాంకు

  • ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానానికి హిట్ మ్యాన్

  • మొదటి స్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్.
ICC ODI Rankings: మరోసారి అత్యుత్తమ ర్యాంకు సాధించిన ‘హిట్ మ్యాన్’..

వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన తోటి బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌ను వెనక్కి నెట్టి రెండవ స్థానాన్ని సాధించాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ గా కొనసాగుతున్నాడు. కాగా.. రోహిత్ శర్మ ఇప్పటివరకూ ఎప్పుడూ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌ ర్యాంకును సాధించలేదు. అయితే రాబోయే రోజుల్లో నంబర్ వన్ స్థానాన్ని పొందే అవకాశం ఉంది.

హిట్‌మ్యాన్‌గా పేరొందిన రోహిత్ శర్మ ఖాతాలో ప్రస్తుతం 765 రేటింగ్ పాయింట్లు ఉండగా.. బాబర్ ఆజం 824 పాయింట్లతో నంబర్ వన్‌ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ తన కెరీర్‌లో అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించాడు. రోహిత్ శర్మ 882 పాయింట్లు సాధించి రెండవ స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 909 పాయింట్లతో చాలా కాలం పాటు నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం శుభ్‌మాన్ గిల్ మూడో స్థానంలో ఉన్నాడు. గిల్ ఖాతాలో 763 పాయింట్లు ఉండగా, విరాట్ 746 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

37 సంవత్సరాల వయస్సులో రోహిత్ శర్మ ప్రస్తుతం ఐసీసీ వన్డే, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇండియా తరపున నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో అతని ర్యాంకింగ్ 6వ స్థానంలో ఉంది. గత కొన్నేళ్లుగా రోహిత్ శర్మ తన ఆట తీరులో భిన్నమైన కోణాన్ని కనబరుస్తు్న్నాడు. అతను తన వికెట్ గురించి పట్టించుకోకుండా.. జట్టు కోసం వేగంగా పరుగులు సాధిస్తాడు. అయితే.. విరాట్ కోహ్లీ మాత్రం జట్టును నిర్వహించే పనిలో ఉంటాడు. రోహిత్ శర్మ దూకుడు బ్యాటింగ్ జట్టుకు మంచిదే అయినప్పటికీ.., టీమిండియా మిడిల్ ఆర్డర్ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన కనబరచలేకపోతున్నారు.