Leading News Portal in Telugu

Bangladesh Crises: భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌లు నిర్వహించొద్దు- హిందూ మహాసభ


  • 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌-భారత్‌ల మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్

  • గ్వాలియర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య అంతర్జాతీయ మ్యాచ్‌ను..

  • నిర్వహించేందుకు అనుమతించబోం- హిందూ మహాసభ

  • గ్వాలియర్‌ వీధుల్లో నిరసనలు తెలుపుతూ స్టేడియంలోని పిచ్‌ను తవ్వుతాం- హిందూ మహాసభ.
Bangladesh Crises: భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌లు నిర్వహించొద్దు- హిందూ మహాసభ

14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌-భారత్‌ల మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. గ్వాలియర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించేందుకు అనుమతించబోమని హిందూ మహాసభ ప్రకటించింది. గ్వాలియర్‌ వీధుల్లో నిరసనలు తెలుపుతూ స్టేడియంలోని పిచ్‌ను తవ్వుతామన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై ఊచకోతకు పాల్పడుతున్నారని హిందూ మహాసభ పేర్కొంది. హిందువుల ఇళ్లు, దేవాలయాలకు నిప్పు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. హిందూ మహిళలను కూడా హింసిస్తున్నారని వారు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లు ఆడడం హిందువులకు ద్రోహం అని అన్నారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అంటే అస్సలు సహించేది లేదని.. బంగ్లాదేశ్‌ జట్టును గ్వాలియర్‌కు రాణించొద్దని హిందూ మహాసభ పేర్కొంది.

Samantha: సమంత సీక్రెట్ డేటింగ్.. అతని బ్యాక్ గ్రౌండ్ ఇదే!

గ్వాలియర్‌లో జరగనున్న బంగ్లాదేశ్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ను రద్దు చేసేందుకు ప్రధాని మోడీకి 15 రోజుల సమయం ఇస్తున్నామని హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ అన్నారు. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ గ్వాలియర్‌లో జరిగితే మతపరమైన వాతావరణం మరింత దిగజారుతుందని తెలిపారు. బంగ్లాదేశ్ జట్టు ఇక్కడ మ్యాచ్ ఆడితే నల్లజెండాలతో నిరసన తెలపడంతో పాటు మ్యాచ్ జరిగే పిచ్‌ను కూడా తవ్వుతామని హెచ్చరించారు.

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024 స్క్వాడ్స్ ప్రకటన.. కెప్టెన్స్ వీళ్లే..!

అక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగనున్న టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ షెడ్యూల్ విడుదల కావడం గమనార్హం. ఈరోజు GDCA వైస్ ప్రెసిడెంట్ మహాన్ ఆర్యమాన్ సింధియా మాట్లాడుతూ.. ‘గ్వాలియర్‌కు ఇది ఒక పెద్ద విజయం. మా తాతయ్య కల నెరవేరబోతోంది. మధ్యప్రదేశ్‌లో క్రికెట్‌ను ఎలా ప్రోత్సహించాలనే దానిపై మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. దీని ఫలితంగానే 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనుంది.’ అని తెలిపారు. కాగా.. 2010లో ఇక్కడ జరిగిన చివరగా సౌతాఫ్రికా-భారత్‌ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ తొలి డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.