- చాలా కాలం పాటు భారత జట్టుకు దూరమైన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.
- కౌంటీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.
- నార్తాంప్టన్‌షైర్ కు అరంగేట్రం చేశాడు.

Yuzvendra Chahal: చాలా కాలం పాటు భారత జట్టుకు దూరమైన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కౌంటీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే పంజా విసిరాడు. బుధవారం అతను నార్తాంప్టన్‌షైర్ కు అరంగేట్రం చేశాడు. తన అరంగేట్రం మ్యాచ్ లోనే మాజీ కౌంటీ జట్టు కెంట్ స్పిట్ ఫైర్స్ పై 10 ఓవర్లలో 14 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు., ఈ సమయంలో అతను 5 మెయిడెన్ ఓవర్లు కూడా వేశాడు. చాహల్ ప్రదర్శనతో, నార్తాంప్టన్ షైర్ 9 వికెట్ల తేడాతో కెంట్ స్పిట్‌ఫైర్స్ ను ఓడించింది. చాహల్‌తో పాటు జస్టిన్ బ్రాడ్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. అతను 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
Pavithrotsavam 2024: నేటి నుంచి శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు
చాహల్, బ్రాడ్ అద్భుత బౌలింగ్ కారణంగా ప్రత్యర్థి జట్టు 35.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. కెంట్ స్పిట్‌ఫైర్స్ బ్యాట్స్మెన్స్ లో జాడిన్ డెన్లీ (22), ఎకాన్ష్ సింగ్ (10), మాట్ పార్కిన్సన్ (17 ) పరుగులు మినహాయించి ఎవరు కూడా రెండు అంఖ్యల స్కోర్ ను చేరుకోలేకపోయారు. అనంతరం నార్త్‌యాంప్టన్‌షైర్ 14 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 86 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నమెంట్‌లో చివరి మ్యాచ్ ని ఆడుతున్న నార్తాంప్టన్ షైర్ ఈ సీజన్ లో మొదటి విజయం సాధించింది. ఇంతకు ముందు ఆ జట్టు 6 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Weight Loss: వామ్మో.. 542 కిలోల బరువు తగ్గిన వ్యక్తి.. ఎలా సాధ్యమైందంటే..?
ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్‌లో చాహల్ గణాంకాలను పరిశీలిస్తే, అతను తన కెరీర్‌లో ఇప్పటివరకు 72 వన్డేలు, 80 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. చాహల్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. వన్డేల్లో 69 ఇన్నింగ్స్‌ల్లో 121 వికెట్లు పడగొట్టాడు. సగటు 27.13, ఎకానమీ 5.26. అలాగే అంతర్జాతీయ టీ20లో 79 ఇన్నింగ్స్‌లలో 96 వికెట్లు పడగొట్టాడు.
10 overs.
5 maidens.
14 runs.
5 wickets.Take a bow, @yuzi_chahal 👏 pic.twitter.com/LDuDVzhNvy
— Northamptonshire Steelbacks (@NorthantsCCC) August 14, 2024