Leading News Portal in Telugu

Test Cricket: టెస్ట్‌ల్లో సచిన్ రికార్డును బద్దలు కొట్టగల ఆటగాడే అతడే..!


  • టెస్ట్‌ క్రికెట్‌లో సచిన్ రికార్డును బద్దలు కొట్టగల సత్తా జో రూట్‌ కు ఉంది- రికీ పాంటింగ్

  • ఇటీవలే టెస్టు క్రికెట్‌లో 12000 పరుగుల మార్క్‌ను దాటిన జో రూట్.
Test Cricket: టెస్ట్‌ల్లో సచిన్ రికార్డును బద్దలు కొట్టగల ఆటగాడే అతడే..!

టెస్ట్‌ క్రికెట్‌లో సచిన్ రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌ కు ఉందని.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. పరుగుల కోసం ఆతృతగా ఉన్నాడని, తర్వాతి నాలుగేళ్ల పాటు పరుగులు సాధిస్తాడని పాంటింగ్ తెలిపాడు. కాగా.. రూట్ ఇటీవలే టెస్టు క్రికెట్‌లో 12000 పరుగుల మార్క్‌ను దాటిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఐసీసీ సమీక్షలో పాంటింగ్ మాట్లాడుతూ.. ‘రూట్ ఈ రికార్డును బద్దలు కొట్టగలడు. 33 ఏళ్ల వయసులో కేవలం 3000 పరుగుల వెనుకబడి ఉన్నాడు. చూద్దాం ఎన్ని టెస్టులు ఆడతాడో. ఏడాదికి 10 నుంచి 14 టెస్టులు ఆడి ఏటా 800 నుంచి 1000 పరుగులు సాధిస్తే మూడు నాలుగేళ్లలో రికార్డు సాధిస్తాడు. పరుగులు చేయాలని కసి ఉంటే, అతను చేయగలడు.’ అని పాంటింగ్ చెప్పాడు. మరోవైపు.. వన్డేలు, టీ20ల్లో భారీ స్కోర్లు చేస్తున్నాడని.. హాఫ్ సెంచరీలు చేసి తడబడే రూట్.. ఇప్పుడు సెంచరీలు చేస్తున్నాడని అన్నాడు. నాలుగైదేళ్ల క్రితం రూట్ చాలా హాఫ్ సెంచరీలు సాధించాడని.. అయితే వాటిని సెంచరీలుగా మార్చేందుకు చాలా ఇబ్బందిపడ్డానని చెప్పాడు. రూట్.. చాలాసార్లు హాఫ్ సెంచరీలు చేశాడని.. వాటిని సెంచరీలుగా మార్చడంలో విజయం సాధించాడు. ఇది అతనికి అతిపెద్ద మార్పు అని పాంటింగ్ అన్నాడు.

రూట్ ఇప్పటివరకు 143 టెస్టుల్లో 12027 పరుగులు చేశాడు. శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర (12400 పరుగులు), అలిస్టర్ కుక్ (12472 పరుగులు)లను అధిగమించడానికి దగ్గర్లో ఉన్నాడు. టెండూల్కర్ 200 టెస్టుల్లో 15921 పరుగులు చేశాడు. పాంటింగ్ 168 టెస్టుల్లో 13378 పరుగులు చేసి జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.