Leading News Portal in Telugu

Vinesh Phogat: చనిపోతుందేమోనని భయపడ్డాం.. వినేశ్ ఫోగట్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు


  • వినేష్ ఫోగట్‌ కోచ్‌ వూలర్ అకోస్ ఆశ్చర్యకరమైన విషయాలు

  • ఒలింపిక్ ఫైనల్‌కు ముందు రోజు రాత్రి బరువు తగ్గేందుకు..

  • వినేష్ దాదాపు ఐదున్నర గంటల పాటు వివిధ రకాల కసరత్తులు చేసింది- కోచ్

  • ప్రాక్టీస్ తర్వాత చనిపోతుందేమోనని భయపడ్డాం- వూలర్ అకోస్.
Vinesh Phogat: చనిపోతుందేమోనని భయపడ్డాం.. వినేశ్ ఫోగట్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపిక్ క్రీడలకు అనర్హత వేటుపై వినేష్ చేసిన అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అడ్ హాక్ డివిజన్ బుధవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో రజత పతకం వస్తుందనే ఆశలు ఆవిరయ్యాయి. మహిళల 50 కేజీల విభాగం ఫైనల్‌లో వినేష్ 100 గ్రాములు అధిక బరువుతో ఫైనల్ ఆడలేక అనర్హులుగా ప్రకటించారు. కాగా.. వినేష్ కోచ్ మరియు సిబ్బంది బరువు తగ్గడానికి ఎన్నో పద్ధతులు అనుసరించారు.. అయినప్పటకీ విజయం సొంతం కాలేదు. ఇదిలా ఉంటే.. పారిస్ గేమ్స్‌లో వినేష్ ఫోగట్‌కు కోచ్‌గా ఉన్న వూలర్ అకోస్ ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడు.

AP Govt: కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల కోసం రూ.10 కోట్లు ఇచ్చిన ఏపీ సర్కార్

ఒలింపిక్ ఫైనల్‌కు ముందు రోజు రాత్రి బరువు తగ్గేందుకు.. వినేష్ దాదాపు ఐదున్నర గంటల పాటు వివిధ రకాల కసరత్తులు చేసినట్లు కోచ్ వూలర్ అకోస్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపాడు. ఈ సమయంలో ప్రాక్టీస్ తర్వాత చనిపోతుందేమోనని భయపడ్డామన్నాడు. తొలి ఒలింపిక్స్‌ను సాధించడానికి వినేష్ తన జీవితాన్ని లెక్క చేయలేదని కోచ్ తన పోస్ట్‌లో చెప్పాడు. సెమీ-ఫైనల్ తర్వాత ఆమె బరువు 2.7 కిలోలు ఎక్కువ.. తాము ఒక గంట ఇరవై నిమిషాలు వ్యాయామం చేసాము. కానీ అప్పటికీ1.5 కిలోలు ఎక్కువగా ఉందని చెప్పాడు. “అర్ధరాత్రి నుండి ఉదయం 5:30 వరకు.. వినేశ్ వివిధ కార్డియో మెషీన్లు, రెజ్లింగ్ కదలికలపై పనిచేసింది, ఒక గంటలో కొన్ని నిమిషాల విరామం తీసుకొని 40-45 నిమిషాలు పాటు కసరత్తులు చేస్తూనే ఉంది. పడుతూ లేస్తూ వర్కౌట్స్ చేసింది. చివరి గంటలో మొత్తం చెమటతో తడిసిపోయింది.” అని చెప్పాడు. ఈ క్రమంలో.. ఆమె చనిపోతుందేమోనని భయపడినట్లు కోచ్ వూలర్ అకోస్ చెప్పాడు.

Shocking News: ఇదేం పోయేం కాలం.. గుడిలో పోర్న్ ..!

29 ఏళ్ల వినేష్.. మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్‌కు ముందు ఆమె బరువు నిర్దేశించిన పరిమితి కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నందున అనర్హురాలిగా ప్రకటించారు. కాగా.. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కేవలం ఆరు పతకాలు మాత్రమే వచ్చాయి. అందులో ఒక రజతం, ఐదు కాంస్యాలు ఉన్నాయి. అయితే.. వినేశ్ పై అనర్హత వేటు పడటంతో తీవ్ర మనస్తాపానికి గురై సోషల్ మీడియా ద్వారా రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించింది.