Leading News Portal in Telugu

Vinesh Phogat: అస్వస్థతకు గురైన వినేశ్‌ ఫొగాట్!


  • స్వదేశానికి చేరుకున్న వినేశ్‌ ఫొగాట్‌
  • స్వగ్రామంలో ఘనస్వాగతం
  • స్వల్ప అస్వస్థతకు గురైన వినేశ్‌
Vinesh Phogat: అస్వస్థతకు గురైన వినేశ్‌ ఫొగాట్!

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో పాల్గొని స్వదేశానికి చేరుకున్న రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ అస్వస్థతకు గురయ్యారు. పారిస్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన వినేశ్‌కు ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి స్వగ్రామం హరియాణాలోని బలాలికి 13 గంటల పాటు ప్రయాణించి చేరుకున్నారు. బలాలి గ్రామస్థులు ఆమెకు భారీగా లడ్డూలను బహుమతిగా అందజేశారు. అంతేకాదు రూ.21 వేలను కూడా గిప్ట్‌గా ఇచ్చారు. స్వగ్రామానికి చేరుకున్న సందర్భంగా స్థానికులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

సుదీర్ఘమైన ప్రయాణంతో తీవ్రంగా అలసిపోయిన వినేశ్‌ ఫొగాట్‌.. ఆత్మీయ సమావేశం జరుగుతుండగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు కుర్చీలోనే పడుకుండి పోయారు. దీంతో క్కడ ఉన్న వారు కంగారుపడ్డారు. వినేశ్‌ పక్కనే ఉన్న రెజ్లర్‌ బజరంగ్‌ పునియా వాటర్ బాటిల్ ఇవ్వగా.. నీరు తాగిన కాసేపటికి ఆమె తేరుకున్నారు. ఎక్కువ సమయం ప్రయాణించడంతో వినేశ్‌ కాస్త ఇబ్బంది పడ్డారని బజరంగ్‌ పునియా తెలిపారు. 29 ఏళ్ల వినేశ్‌.. 100 గ్రాముల అధిక బరువు ఉన్నందుకు మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్ ఆడని విషయం తెలిసిందే.