Leading News Portal in Telugu

David Malan: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్..


  • ఇంగ్లండ్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
  • ఇంగ్లాండ్ టీం తరుపున జోస్ బట్లర్ కాకుండా
  • అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఇంగ్లండ్ ఆటగాడు మలన్.
  • 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత మలన్ ఇంగ్లండ్ జట్టుకు దూరమయ్యాడు.
David Malan: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్..

David Malan retired: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్ 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపోతే ఇంగ్లాండ్ టీం తరుపున జోస్ బట్లర్ కాకుండా, అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఇంగ్లండ్ ఆటగాడు మలన్. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత మలన్ ఇంగ్లండ్ జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కూడా అతను జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఈ కారణంగానే రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

PM Modi: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన 10కు పదేళ్లు.. 53 కోట్ల ఖాతాల్లో రూ. 2లక్షల కోట్లు

మలన్ ఇంగ్లండ్ తరఫున 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. అతను టి20 క్రికెట్‌ లో నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌ గా కూడా నిలిచాడు. టెస్టుల్లో ఈ ఇంగ్లండ్ ఆటగాడు 27.53 సగటుతో 1,074 పరుగులు చేశాడు. వన్డేల్లో 55.76 సగటుతో 1,450 పరుగులు చేశాడు. టి20లో 36.38 సగటుతో 1,892 పరుగులు చేశాడు. అలాగే మలన్ టెస్ట్, టి20 లలో ఒక్కొక్క సెంచరీ సాధించగా.. వన్డే లలో 6 సెంచరీలు సాధించాడు.

Rajayasabha: తొలిసారిగా రాజ్యసభలో ఎన్డీఏకు మెజారిటీ స్థానాలు..