- పారిస్ పారాలింపిక్స్‌లో భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన
-
భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు -
మహిళల సింగిల్స్ ఎస్‌యూ5 విభాగంలో తులసిమతి మురుగేశన్ కు రజత పతకం -
మనీషా రామదాస్ కాంస్య పతకం.

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ కు పతకాల పంట పండుతుంది. తాజాగా.. మరో రెండు పతకాలు సాధించింది. భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేసి రెండు పతకాలు సాధించారు. మహిళల సింగిల్స్ ఎస్‌యూ5 విభాగంలో తులసిమతి మురుగేశన్ రజత పతకాన్ని గెలుచుకుంది. అదే విభాగంలో మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సాధించింది. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 11 పతకాలు సాధించింది. ఇదిలా ఉంటే.. బ్యాడ్మింటన్‌లో దేశానికి ఇది మూడో పతకం. మురుగేశన్, మనీషా కంటే ముందు నితీష్ కుమార్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్ 3 విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు.
కాంస్య పతక పోరులో మనీషా 21-12, 21-8తో డెన్మార్క్‌కు చెందిన కేథరీన్ రోసెన్‌గ్రెన్‌ను ఓడించింది. ఫైనల్‌లో మురుగేశన్ చైనాకు చెందిన యాంగ్ క్వి జియాతో తలపడింది. తన ప్రత్యర్థిని అధిగమించలేకపోయింది. దీంతో.. 17-21, 10-21 తేడాతో ఓడి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.