Leading News Portal in Telugu

Paralympics 2024: పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే!


  • సోమవారం భారత్ ఖాతాలో 6 పతకాలు
  • ఇప్పటివరకు 15 మెడల్స్
  • నేటి భారత షెడ్యూల్ ఇదే
Paralympics 2024: పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే!

Paralympics 2024 India Schedule: పారిస్‌ పారాలింపిక్స్‌ 2024లో సోమవారం భారత్ ఖాతాలో ఏకంగా ఆరు పతకాలు చేరాయి. షూటర్ నితేశ్‌ కుమార్‌ ఎస్‌ఎల్‌-3 విభాగంలో స్వర్ణం గెలిచాడు. ఎస్‌ఎల్‌-4లో సుహాస్‌ యతిరాజ్‌ రజతం సాధించాడు. మహిళా షూటర్లు తులసిమతి మురుగేశన్ రజతం, మనీషా రామ్‌దాస్‌ కాంస్యం సాధించారు. డిస్కస్‌ త్రోలో యోగేశ్‌ కతూనియా రజత పతకం గెలిచాడు. ఆర్చరీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శీతల్‌ దేవి, రాకేశ్‌ కుమార్‌ జోడి కాంస్యం సాధించింది. ఇప్పటివరకు భారత్ 15 మెడల్స్ ఖాతాలో వేసుకుంది. నేడు కూడా మనకు కీలక పోటీలు ఉన్నాయి. నేటి భారత షెడ్యూల్ను ఓసారి చూద్దాం.

భారత షెడ్యూల్:
షూటింగ్‌:
మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రి పొజిషన్స్‌ (క్వాలిఫికేషన్స్‌): మోనా అగర్వాల్, అవని లేఖరా, మధ్యాహ్నం 1 గంట నుంచి